గత కొద్దిరోజులుగా నిక్ జోనస్ తో ప్రేమ వార్తలతో మీడియాలో హాట్ టాపిక్ అయిన ప్రియాంకా చోప్రా తాజాగా ఓ మెహందీ ఫంక్షన్ లో దర్శనమిచ్చింది. ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ, శోక్లా మెహతాల మెహందీ ఫంక్షన్ బుధవారం అట్టహాసంగా జరిగింది.

ఈ వేడుకలో పాల్గొన్న ప్రియాంకా వారితో తీసుకున్న ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసింది. ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రియాంకా పెట్టిన పోస్ట్ నెటిజన్లను ఆకర్షిస్తోంది. ప్రియాంకాతో పాటు ఈ వేడుకకు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. షారుఖ్ ఖాన్, ఐశ్వర్యారాయ్. కత్రినా కైఫ్, కరణ్ జోహార్ ఇలా చాలా మంది ఈ వేడుకలో పాలు పంచుకున్నారు.