పెళ్లి చూపులు సినిమా తర్వాత కమెడియన్ గా మాంచి పాపులారిటీ సంపాదించాడు ప్రియదర్శి.  ఆ మూవీలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఈ యంగ్ కమెడియన్ ప్రస్తుతం వరుస చిత్రాలలో అవకాశాలు దక్కించుకుంటున్నాడు.ఈ పాపులర్ కమెడియన్ తన ప్రేయసి పుట్టిన రోజు సందర్భంగా ప్రియురాలిని పరిచయం చేశాడు. ఇప్పుడు ప్రియందర్శి లవ్ స్టోరీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

 

పెళ్లి చూపులు లాంటి ఒక జాతీయ అవార్డుని దక్కించుకున్న సినిమాలో ప్రియదర్శి అబ్బురపరిచారు. ఈ చిత్రం విడుదలయ్యాకా ఇండస్ట్రీ మొత్తం ప్రియదర్శి గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టింది. వరుస చిత్రాల్లో అవకాశం అందుకుంటున్న ప్రియదర్శి కేవలం కమెడియన్ గానే కాక క్యారక్టర్ ఆర్టిస్ట్ గా కూడా సత్తా చాటుతున్నాడు. తాజాగా విడుదలైన తొలిప్రేమ చిత్రంలో కూడా ప్రియదర్శి హవా కొనసాగింది.

 

ఇక తొలిప్రేమ లాంటి సూపర్ హిట్ లవ్ స్టోరీలో నటించిన ప్రియదర్శి.. తన పర్సనల్ లైఫ్ లోకూడా ఘాటు ప్రేమలో మునిగి తేలుతున్నాడు. ప్రియదర్శి, రిచా శర్మ అనే యువతితో ఘాడమైన ప్రేమలో ఉన్నాడట. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ ఓ పోస్ట్ పెట్టాడు. రిచా పుట్టిన రోజు సందర్భంగా ప్రియదర్శి ఈ పోస్ట్ పెట్టాడు. ఈ యంగ్ అండ్ బడ్డింగ్ ఆర్టిస్ట్, రిచా శర్మని త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 23 న వీరి వివాహం హైదరాబాద్ లో జరగనుందని సమాచారం.