తన ఫీలింగ్స్ ను అమ్మాయి కంటి సైగలతో పర్ ఫెక్ట్ గా ఎక్స్ ప్రెస్ చేస్తే ఎంత మంది ఫిదా అవుతారో ఇటీవల ప్రియా వారియర్ ఒక్క సైగతో చెప్పేసింది. ఓరు ఆడార్ లవ్ అనే సినిమాలోని ఆ వీడియో ఎంతగా పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

 

ప్రియా తాజాగా మరొక గన్ షాట్ లాంటి కిస్ షాట్ తో కలవరపరిచింది. ఎవరి వాట్సాప్ స్టేటస్ లో చూసినా అదే వీడియో కనిపిస్తోంది. మగాళ్లయితే ఈ బ్యూటీ ని రోజు తెగ చూసేస్తున్నారు. మరోవైపు రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమాలోని ఒక సాంగ్ పై కొన్ని రూమర్స్ వచ్చాయి.

 

ప్రియా వారియర్ పై హైదరాబాద్ లో ఒక యువకుడు పోలీస్ కేసు నమోదు చేసినట్లు వార్తలు వచ్చాయి. ముస్లిమ్ సెంటిమెంట్స్ కి భంగం కలిగించేలా ఆ పాట ఉందని కథనాలు వెలువడ్డాయి. కొంతమంది నిజంగానే పోలీస్ కేసు కూడా పెట్టారు. ఇదంతా ఒకెత్తయితే.. ఇక ప్రియా వారియర్ పై ఫత్వా కూడా జారీ చేశారంటూ మరి కొన్ని వార్తలొచ్చాయి. ఒక్క సినిమా రిలీజ్ కాలేదు.. అయినా ఒక యంగ్ నటిపై ఇలాంటి ఫత్వాలు గట్రా అంటే ఎలాగైనా భయంగానే ఉంటుంది. అయితే ఆ రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని రీసెంట్ గా తెలిసింది. అవన్నీ పుకార్లేనట.ఎందుకంటే ఎదో పేరడీ వెబ్ సైట్ వైరల్ అయ్యేందుకు అలా తప్పుడు వార్తలను ప్రచారం చేసింది. అలాంటి ఫత్వా వార్తలను చూసి చాలా మంది నిజమని నమ్మేశారు. ఇక ప్రస్తుతం ఓరు ఆధార్ లవ్ అనే ఈ మలయాళం సినిమాకి దేశ వ్యాప్తంగా క్రేజ్ పెరుగుతోంది. హీరోయిన్ ప్రియా వారియర్ ఇంత ప్రేమను ఒకేసారి తట్టుకోలేకపోతోందట. అది సంగతి.