అందాల పోటీల్లో అదరగొట్టిన ప్రియా ప్రకాష్ (వీడియో)

Priya Prakash Varrier's throwback beauty contest video will win your heart
Highlights

అందాల పోటీల్లో, క్యూట్ సమాధానాలతో అదరగొట్టిన ప్రియా ప్రకాష్ 

హైదరాబాద్ : భారతదేశాన్ని మొత్తం కన్ను కొట్టి ఒక ఊపు ఊపేసిన స్టార్ ప్రియా ప్రకాష్. ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాని మొత్తం మంత్ర ముగ్ధుల్ని చేసేసింది. గతంలో ఈ కేరళ కుట్టీ ఒక బ్యూటీ కాంటెస్ట్ లో పాల్గొన్న వీడియో ఒకటి ఇంటర్నెట్ లో హాల్ చల్ చేస్తోంది. ఈ వీడియోలో... జడ్జెస్ అడుతున్న ప్రశ్నలకు క్యూట్ ఎక్స్ ప్పెషన్స్ లో సమాధానాలు  చెప్ప్తన్న ప్రియా ప్రకాష్. 

                                    

ప్రస్తుతం తను కేరళలో నివసిస్తున్నా, ఒకప్పుడు మాత్రం ముంబైలో ఉండేవారు. ఈ కాంటెస్ట్ పాల్గొనే సమయానికి తను డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుండేది. ఈ వీడియోలో తనని పరిచయం చేసుకుంటు తనకి నటన, సంగీతం అంటే చాలా ఇష్టమని తెలిపింది. 

ప్రియా ప్రకాష్ కు సోషల్ మీడియాలో గట్టి ఫాలోయింగే ఉంది. ఒక్క తన ఇంస్టా గ్రామ్ లో మాత్రమే 6.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారంటేనే తన స్టామినా ఏంటో అర్థం అవుతుంది. ఈ ఫాలోయింగ్ చూసే తన వద్దకు పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు క్యూ కట్టాయి. రీసెంట్ గా తన తో ఒక చాక్లెట్ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ గా అగ్రిమెంట్ చేయించుకుంది. అంతేకాదండోయ్.. ఈ మధ్యనే ఒక సినిమాకి కూడా సైన్ చేసింది. ప్రస్తుతం తను చేస్తున్న మళయాళం సినిమా తుది దశకు చేరుకుంది. కేవలం ప్రియా కోసమే క్లైమాక్స్ సీన్స్ మార్చారంటే తన పాపులారిటీ ఏ రేంజ్ లో ఉందో అర్థం అవుతుంది.


ఈ సినిమా అన్ని భాషల్లోను(హిందీ,మళయాళం,తమిళం,తెలుగు) విడుదల చేయాడానికి సన్నాహాలు జరుగుతుంది. ఏమైన ఒక వీడియోతో ఇంత పాపులర్ అయిపోవడం ఎంతైన తన అదృష్టమనే చెప్పాలి. 

loader