షాక్..! రోడ్డుకెక్కిన ప్రియా వారియర్

First Published 24, Mar 2018, 5:07 PM IST
Priya prakash advertisements at gujarat
Highlights
  • కన్ను కొట్టి ఒక్క విడియోతో కోట్లాది మంది ఫాలోవర్లను సంపాదించింది మలయాళ టీనేజర్ ప్రియ ప్రకాష్ వారియర్
  • ఆమె కన్ను కొట్టే వీడియో లేకుండా దేశవ్యాప్తంగా పాపులరైంది​
  • గుజరాత్ లోని వడోదరలో పోలీసులు ఒక మంచి ప్రచారం కోసం ప్రియ ఫొటోను వాడుకుంటుండటం విశేషం​

కన్ను కొట్టి ఒక్క విడియోతో కోట్లాది మంది ఫాలోవర్లను సంపాదించింది మలయాళ టీనేజర్ ప్రియ ప్రకాష్ వారియర్. ఆమె కన్ను కొట్టే వీడియో లేకుండా దేశవ్యాప్తంగా పాపులరైంది.  ఆమె ప్రభావం యువతపై ఏ స్థాయిలో ఉందంటే.. ఒక కాలేజీలో అమ్మాయిలందరూ ప్రియలాగా కన్ను కొట్టడం ప్రాక్టీస్ చేస్తుండటంతో అలా చేస్తే ఏడాది పాటు కాలేజీ నుంచి డిబార్ చేస్తామనే పరిస్థితి వచ్చింది. మరో వైపు ఆమె పాపులారిటీని మంచి పనులకూ ఉపయోగించుకునే వాళ్లూ తక్కువేమీ కాదు.
 

ప్రియ కన్ను కొడుతున్న చిత్రాన్ని ముద్రించి ట్రాఫిక్ అవేర్ నెస్ మీద ప్రకటనలు రూపొందించారు అక్కడి పోలీసులు. రెప్పపాటులో ప్రమాదాలు చోటు చేసుకుంటాయని.. కాబట్టి అప్రమత్తంగా ఉండాంటూ పక్కనే ప్రియ కన్ను కొడుతున్న చిత్రం పెట్టారు. ఇలా పలు వినూత్నమైన ప్రకటనలు రూపొందించారు. ఈ సృజనాత్మకత వెనుక ఒక యాడ్ ఏజెన్సీ ఉందట. మామూలుగా నీతులు చెబితే జనాలకు ఏం పడుతుంది. ఇలా ప్రియ వారియర్ ఫొటో కనిపించి.. దాని పక్కన మంచి విషయం చెబితే కచ్చితంగా అది జనాల్ని ఆకర్షిస్తుంది. వడోదర పోలీసులు ఈ విషయంలో మంచి ఎత్తుగడే వేశారని చెప్పాలి.

 

loader