బిగ్ బాస్ హౌజ్ లో 18వ రోజు ఆసక్తికర సంఘటనలు దీక్షతో రాజీ కుదుర్చుకునే ప్రసక్తే లేదన్న అర్చన ముద్దు పెట్టిన ప్రిన్సే బిగ్ బాస్ కు దీక్షపై ఫిర్యాదు ముమైత్ తో తను ఇష్టపడ్డ వాడు గుర్తొచ్చాడన్న అర్చన
ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ షో రోజు రోజుకు రసవత్తరంగా మారుతోంది. గ్లామర్ గర్ల్ దీక్ష ఏంట్రీ తర్వాత షో ఇంట్రెస్టింగ్ గా మారిందనేలా మరో సంఘటన జరిగింది. 18వ రోజు ఉదయం.. వి లవ్ బ్యాడ్ బోయ్స్ సాంగ్ తో.. రోజు మొదలైంది. ఉదయం 8.45కు మెల్లిగా ముమైత్ ఖాన్ ఆసక్తికర విషయం గురించి శివబాలాజీతో చర్చ పెట్టింది. తనతో అర్చన యాటిట్యూడ్ చూపిస్తోందంటూ దీక్ష ముమైత్ తో చెప్పినట్లు శివ బాలాజీకి చెప్పింది. అలా మొదలైన చర్చ కాసేపు ఇద్దరి మధ్య రాజీ కుదిర్చేందుకు అంతా ప్రయత్నం చేశారు. కానీ అర్చన మాత్రం రాజీ కుదుర్చుకోలేదు. ఇంక ఆ విషయం మరచిపోవాలంటూ అర్చనతో ధన్ రాజ్ చెప్పినా.. ఎవరు చెప్పినా దీక్ష విషయంలో నేను వినను అంటోంది అర్చన. ముమైత్ తో దీక్ష నా గురించి చాలా చెప్పిందట అంటూ అర్చన ఫిర్యాదు చేసింది. దీక్షతో రాజీ పడాల్సిన అవసరం తనకు లేదంటూ మొండికేసింది.
మ.1 గంటకు..
ప్రిన్స్ కెప్టెన్ గా అంతా తెలుగులో మాట్లాడేలా చూడాల్సిన బాధ్యత నీపై ముమైత్, ఆదర్శ్, మహేష్, అర్చన ఆంగ్లంలో మాట్లాడుతున్నారు. వారు నియమాలు ఉల్లంఘించకుండా చూడాల్సిన అధికారం బాధ్యత మీదేనని బిగ్ బాస్ గుర్తించారు. ఇదిలాగే సాగితే కెప్టెన్సీపై ప్రభావం తప్పదని బిగ్ బాస్ హెచ్చరించారు.
దాంతో ప్రిన్స్ వాళ్లందరిని పిలిచి... దీనిపై, అలానే టైమ్ కు పడుకోవట్లేదనే అంశంపై హెచ్చరించారు. తప్పులు జరిగితే నేను చర్యలు తీసుకోవాల్సి వుంది. తర్వాత కాసేపు బెడ్ రూమ్ లో ముమైత్ సమక్షంలో అర్చన,, దీక్షల మధ్య వాగ్వాదం జరిగింది. టిష్యూ పేపర్ చేతిలో పట్టుకున్న దీక్షతో అది డస్ట్ బిన్ లోనే వేయాలి అంది. దానికి ప్రతిగా నేమను బయట వెళ్లి డస్ట్ బిన్ లోనే వేస్తాను అంది. దానికి బదులుగా కావాలనే...ఉద్దేశపూర్వకంగా.. తనకు నాతోనే ప్రాబ్లెమ్ అంటూ అర్చన మొదలు పెట్టింది. దీంతో తొలిరోజు బానే వున్నావు కానీ తర్వాత మారిపోయావని దీక్ష అంది. కానీ నాకు నీపై ఎలాంటి దురుద్దేశం లేదని అర్చన అంది. అంతకు ముందు బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ సందర్భంగా.. దీక్ష వల్ల పిన్ దొరక్క ఇబ్బంది పడ్డానని అర్చన చెప్పుకొచ్చింది. మరోపక్క నేను పసుపు పట్టుకుని వచ్చినా కావాలనే..మళ్లీ హరిని పసుపు అడిగావు కదా అని ఆరోపించింది. నాకు ఎవరితో ప్రాబ్లెమ్ లేదు.. నీతోనే ఎందుకు అవుతుంది. మాట్లాడుదామంటే.. ఆర్గ్యూ చేస్తోందని దీక్ష పేర్కొంది. అయితే స్విమింగ్ పూల్లో దీక్ష ఏదో అందని అర్చన ఆరోపిస్తోంది. అంతేకాక తన సేఫ్టీ పిన్ ఎక్కడో పెట్టిందని ఆరోపించింది. అయితే దీక్ష మాత్రం తాను ఎక్కడ పిన్ తీశానో అక్కడే పెట్టానని, కావాలనే అలా చేస్తోందని దీక్ష చెప్పుకొచ్చింది.
మ.3.30కు...బిగ్ బాస్ ముందుకు..
లగ్జరీ బజట్ టాస్క్ ఫలితాల ఆధారంగా గెలిచిన వినియోగదారుల జట్టు నుండి ఇద్దరిని ... బెస్ట్ పర్ఫామర్స్ ను నిర్ణయించి బిగ్ బాస్ కు చెప్పాలి. అలానే మొత్తం ఇంటి సభ్యుల నుంచి ఇద్దరు వర్స్ట్ పర్ఫామర్స్ ను బిగ్ బాస్ కు చెప్పాలి అని బిగ్ బాస్ అడగ్గా.. బెస్ట్ పర్ఫామర్స్ గా ఆదర్శ్, కార్తికలను ప్రిన్స్ ప్రకటించాడు. వరస్ట్... అంటే కొంచెం దీక్ష తక్కువ పని చేసింది. సమీర్ పని చేయలేదని పించింది అని ప్రిన్స్ చెప్పాడు. దీంతో ఆదర్శ్, కార్తికలు కెప్టెన్సీ కోసం పోటీ పడాల్సి వుంటుందని బిగ్ బాస్ ఆదేశించారు. ఇక దీక్ష,సమీర్ ఇద్దరికి బిగ్ బాస్ తదుపరి ఆదేశం వరకు ఉల్లిపాయలు కోస్తూనే ఉండాలని, ప్రిన్స్ అది అమలయ్యేలా చూడాలని ఆదేశించారు.
ఇక ఉల్లిపాయలు కోస్తున్న సమీర్, దీక్షలను హరితేజ, ధనుష్ లు కాసేపు రన్నింగ్ కమెంటరీతో ఆటపట్టించారు. అయితే అంతకంటే ఎక్కువ వాళ్లిద్దరి మధ్య జరిగిన సంభాషణలు ఆకట్టుకున్నాయి. తాను పని చేశానని దీక్ష అంటుంటే.. నువ్వు త్వరగా పడుకున్నావు కదా అని సమీర్ చెప్పాడు. ఇక లివింగ్ రూమ్ లో కూర్చున్న హౌజ్ మేట్స్ అంతా దీక్ష స్పెక్ట్స్, లిపిస్టిక్ పెట్టుకుని భలేగా ఉల్లిపాయలు కట్ చేస్తున్నారంటూ ఆటపట్టించారు.
రాత్రి 7.15కు టాస్క్... సెరా ఈత, మెదడుకు మేత
ధన్ రాజ్, ముమైత్ కెప్టెన్స్ గా ఆ గేమ్ లో ఆడాలని పజిల్ టైల్స్ ఇచ్చారు. వాటిని పూల్ లో దిగి కెప్టెన్స్ అడుగున అమర్చాలి. మిగిలిన సభ్యులు సహకరించాలి అని రూల్ పెట్టారు. అలా ఈ గేమ్ లో ధన్ రాజ్ 10.12నిమిషాలకు పూర్తి చేయగా.. ముమైత్ 4.50సెకన్లతో పూర్తి చేసి విజేతగా నిలిచింది. దీంతో ముమైత్ కూడా తదుపరి కెప్టెన్సీ రేస్ లోకి వచ్చింది. ఇక ముమైత్ గెలిచినందుకు బిగ్ బాస్ గిఫ్ట్ ఇచ్చారు. పెరుగు హ్యాంపర్ లేదా ధన్ రాజ్ సర్ప్రైజ్ గిఫ్ట్ లలో ముమైత్ ఏది కావాలంటే అదే ఇస్తామని చెప్పటంతో... ముమైత్ ధన్ రాజ్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలని కోరింది. దీంతో ధన్ రాజ్ భార్య, కుమారుడుకు సంబంధించిన వీడియో రికార్డింగ్ ప్లే చేశారు. దీంతో హౌజ్ అంతా ఒక్కసారిగా బిగ్ బాస్ కుటుంబ సభ్యులు గుర్తొచ్చి ఏడుపులు మొదలుపెట్టారు. ఆదర్శ్ కొంచెం ఎమోషన్ అవటంతో అంతా ఎమోషన్ అయ్యారు. ముఖ్యంగా ఆదర్శ్ కంటతడి పెట్టడం అందర్నీ కదిలించింది. దీక్ష సపరేట్ గా ఆదర్శ్ దగ్గరికి వచ్చి నీ వైఫ్ ఫేస్ బుక్ ఎకౌంట్ చూశాను. వాళ్లు చాలా హాపీగా వున్నారు. నువ్వు బాధ పడకు అని చెప్పి ఓదార్చే ప్రయత్నం చేసింది. ఇక చివరకు అర్చన కూడా ఎమోషన్ అయింది. రాత్రి 9.30ప్రాంతంలో తను కూడా ముమైత్ తో తన కుటుంబ సభ్యులు గుర్తొస్తున్నారని, ముఖ్యంగా తను గతంలో ఇష్టపడ్డ వ్యక్తి గుర్తుకొస్తున్నాడని బాంబ్ పేల్చింది.
ఇక రాత్రి 11.30గంటలకు...
బిగ్ బాస్ సమీర్, దీక్షల ఉల్లిపాయల శిక్ష రద్దు చేశారు. అనంతరం రాత్రి కత్తి కార్తీక, కల్పన ఇద్దరు కాసేపు ఇంటిమసీ పెంచుకునే ప్రయత్నం చేశారు. అనంతరం రాత్రి 12.30కు నేను ప్రిన్స్ కెప్టన్సీకి సపోర్ట్ చేశానని అర్చన అంది.. అయితే తనను మాత్రం ప్రిన్స్ అప్రిషియేషన్ ఇవ్వలేదని అర్చన ఫీలైంది. అప్పుడు ప్రిన్స్ సెకండ్ పేరు నీదే చెప్దామనుకున్నా.. అది కుదరలేదని అన్నారు. చివరగా పడుకునే ముందు ఆదర్శ్, ప్రిన్స్ కాసేపు మాట్లాడుకున్నారు.
