బిగ్ బాస్ హౌజ్ నుంచి ప్రిన్స్ ఎలిమినేషన్ ఆదర్శ్ తో పోటీపడి స్వల్ప తేడాతో వెళ్లిపోయిన ప్రిన్స్ హౌజ్ మేట్స్ తో కబడ్డీ ఆడించిన బిగ్ బాస్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న బిగ్‌బాస్ రియాలిటీ షో సీజన్ 1 మరికొద్ది రోజుల్లో ముగుస్తుండటంతో చివరిరోజుల్లో రోజు రోజుకూ షో సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలిపిస్తోంది. బిగ్ బాస్ సీజన్ 1 టైటిల్ రేస్‌లో ఉన్న ఆదర్శ్, ప్రిన్స్, నవదీప్‌ల లో ఎవరు ఎలిమినేట్ అయి హౌస్‌ని వీడుతారన్నది ఆసక్తిగా సాగింది.
ఇక 57వ రోజు ఎపిసోడ్ లో... ఎన్టీఆర్ ఫుల్ ఎనర్జీని ఎప్పటిలాగే బిగ్‌బాస్‌లో పాస్ చేస్తూ కన్టెస్టెంట్స్‌తో వెరైటీ కబడ్డీ ఆడించారు ఎన్టీఆర్. దీనికోసం హౌస్‌లో ఉన్న కన్టెస్టెంట్స్‌ను రెండు గ్రూపులుగా విభజించారు. ప్రిన్స్, శివబాలాజీ, అర్చనలు ఒక టీం కాగా.. ఆదర్శ్, హరితేజ,నవదీప్‌లు మరో గ్రూప్‌గా ఉన్నారు. అయితే కూతకు వెళ్లే కన్టెస్టెంట్స్ కబడ్డీ.. కబడ్డీ అని కాకుండా హౌస్‌లో ఉన్న తమకు ఇష్టమైన పేరును కూతగా పెట్టాలంటూ కండిషన్ పెట్టారు. ఇక దీక్షను లెగ్ బాగోలేక పోవడంతో ‘కబడ్డీ గేమ్‌కు ఎంపైర్ గా వ్యవహరించమన్నారు. ఇక గేమ్ స్టార్ట్ కావడంతో ‘శివ.. శివ.. శివ’అంటూ కూత మొదలు పెట్టేసి శివబాలాజీని టచ్ చేసి తొలిపాయింట్ కొట్టేసింది. ఫన్నీ.. ఫన్నీగా సాగిన ఈ కబడ్డీ గేమ్‌లో అర్చన టీం హరితేజ టీంపై గెలుపొందింది. గెలిటచిన వారికి పాన్ లు, కారప్పొడి, నెయ్యి, కందిపొడి అందించారు బిగ్ బాస్. అది కేవలం గెలిచిన వారు మాత్రమే తినాలి.
ఆ తర్వాత లివింగ్ రూమ్ కు వచ్చిన హౌజ్ మేట్స్ తో బిగ్ బాస్ ‘నిప్పు లాంటి నిజం’ ఆడించారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు షేర్ చేసుకోని నిజాన్ని బిగ్ బాస్ హౌస్‌లో బహిర్గతం చేయాలని అయితే కేవలం నిజం మాత్రమే చెప్పాలన్నారు. దీంతో ప్రిన్స్ జీవితంలో జరిగిన యాక్సిడెంట్‌ను తన తండ్రికి తెలియకుండా దాచానని అదే నిప్పులాంటి నిజం అంటూ ఆటను ప్రారంభించాడు. ఈ తరువాత దీక్ష, హరితేజ, ఆదర్శ్,అర్చన తమ జీవితంలో దాచిన నిజాలను షేర్ చేసుకోగా.. శివబాలాజీ తనకు ఎలాంటి నిజాన్ని దాచే అలవాటు లేదని అందుకే సీక్రెట్స్ ఏం లేవన్నారు. ఇక నవదీప్ మాత్రం తనవల్ల ఒక యాక్సిడెంట్ జరిగిందని, దాంట్లో తన ప్రమేయం లేకుండానే ఒక కుటుంబ పెద్ద దిక్కుని కోల్పోయిందని వాళ్లని క్షమించమని కోరుతున్నట్టు కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీంతో ఎన్టీఆర్ కూడా ఆ కుటుంబాన్ని నవదీప్ తరపున క్షమించమని కోరారు.
ఇక ఈవారం ఎప్పటిలాగే కాలర్ ఆఫ్ వీక్‌లో భాగంగా హైదరాబాద్ నుండి ఫోన్ చేసిన శివ.. హౌస్‌లో ఉన్న శివబాలాజీతో మాట్లాడాలని మీ రొమాంటిక్ ట్రాక్ వే మారినట్లు ఉందని మొదట్లో దీక్ష అన్నారు. ఇప్పుడేమో కాస్త మారినట్లు ఉందని ఎవరో మీరు చెప్తారా నన్ను చెప్పమంటారా అని కాలర్ అడగగా.. ఎవరో కాదు హరితేజనే అంటూ చెప్పేశాడు శివబాలాజీ. ఇక తప్పకుండా శివబాలాజీ బిగ్ బాస్ విన్నర్ కావాలని కోరుకుంటున్నట్టు కాలర్ తెలియజేయడంతో ధన్యవాదాలు చెప్పారు శివబాలాజీ.
ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీని వ్యతిరేకించిన ఆదర్శ్‌పై ఎన్టీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిగ్ బాస్ అనేది 18 భాషల్లో టెలికాస్ట్ అవుతుందని ప్రతిచోట వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉందని దాన్ని మనం వ్యతిరేకించడం కరెక్ట్ కాదన్నారు. ఒకవేళ నువ్ అనుకున్నట్టు వైల్డ్ కార్డ్ ఎంట్రీని వ్యతిరేకిస్తే.. దీక్షను కూడా వ్యతిరేకించాలి.. నవదీప్‌ను మాత్రమే టార్గెట్ చేయడానికి టైటిల్ రేస్‌లో ఉండటమే కారణం అని అనుకోవచ్చా అని ఎన్టీఆర్ అడగటంతో అవుననే సమాధానం ఇచ్చారు ఆదర్శ్. దీంతో ఆదర్శ్ రెడ్ హాండెడ్ గా దొరికిపోయినట్లయింది.
ఇక ఈవారం ఎలిమినేషన్‌లో ఉన్న నవదీప్, ప్రిన్స్, ఆదర్శ్‌లలో నవదీప్ సేఫ్ జోన్‌లో ఉన్నట్టు ప్రకటించారు ఎన్టీఆర్. ఇక బిగ్ బాస్ హౌస్‌లో ఆదర్శ్ చేసిన తప్పిదం వల్ల ప్రిన్స్ ఈ వారం బిగ్ బాస్ హౌస్‌ను వీడితున్నట్టు ప్రకటించారు ఎన్టీఆర్. దీంతో ప్రిన్స్ మిగిలిన కన్టెస్టెంట్స్‌కు ధైర్యం చెప్తూ హౌస్ నుండి బయటకు వచ్చేశాడు.
ఇక హౌస్ నుండి బయటకు వచ్చిన ప్రిన్స్.. బిగ్ బాస్ సీజన్ 1 టైటిల్ నవదీప్, హరితేజలలో ఎవరో ఒకరు గెలవొచ్చనన్నారు. ఇక వెళ్తూ.. వెళ్తూ బిగ్‌బాంబ్‌ను దీక్షపై వదిలాడు ప్రిన్స్. ఈ బాంబ్‌తో దీక్ష వారం రోజులపాటు ఎక్కడకు వెళ్లినా పాకుతూనే వెళ్తుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్‌లో ప్రిన్స్ బిగ్‌బాస్ హౌస్ వీడుతూ తన జీవితంలో బిగ్ బాస్ హౌస్ ఎప్పటికీ మరిచిపోలేనంటూ ఉద్వేగంగా మాట్లాడుతూ హౌస్‌ను వీడాడు ప్రిన్స్.
