మరో రెండేళ్ల తరువాత తాను తప్పకుండా వివాహం చేసుకుంటానని చెబుతోంది ప్రణీత. అత్తారింటికి దారేది చిత్రంతో ప్రణీత టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకుంది. పాండవులు పాండవులు తుమ్మెద చిత్రంలో కూడా మెరిసింది. ఈ రెండు చిత్రాలు ప్రణీతకు గుర్తింపుని తీసుకువచ్చాయి. బాపు బొమ్మలా ఉండే ప్రణీత నేడు వైజాగ్ లో ఓ ప్రయివేట్ కార్యక్రమంలో మెరిసింది. ఈ సందర్భంగా ప్రణీతకు మీడియా నుంచి పెళ్లి ప్రశ్నలు ఎదురయ్యాయి.

 

తాను రెండేళ్ల తరువాత తప్పకుండ వివాహం చేసుకుంటానని ప్రణీత తెలిపింది. ప్రస్తుతం సినిమాల్లో నటించడంపై దృష్టిపెట్టానని ప్రణీత తెలిపింది. అత్తారింటికి దారేది చిత్రం తరువాత తనకు తెలుగులో మంచి గుర్తింపు లభించిందని ప్రణీత గుర్తుచేసుకుంది. సరైన కథలు వస్తే అన్ని భాషల్లోనూ నటిస్తానని తెలిపింది. వైజాగ్ లో ప్రణీతని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ప్రణీతకు ప్రస్తుతం అవకాశాలు బాగా తగ్గాయి.