హిట్లరే పోయాడు... ఈ బీజేపీ ఎంత?: ప్రకాష్ రాజ్

హిట్లరే పోయాడు... ఈ బీజేపీ ఎంత?: ప్రకాష్ రాజ్

బీజేపీపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి ధ్వజమెత్తారు. తప్పుడు హామీలతో దేశ ప్రజలను బీజేపీ మభ్యపెడుతోందని మండిపడ్డారు. సర్వ ధిక్కార ధోరణి అనేది కొన్ని రోజుల వరకు మాత్రమే పరిమితమని... ఎంతో కాలం కొనసాగదని చెప్పారు. హిట్లర్ లాంటి వారి ఆధిపత్యమే కూలిపోయిందని... ఇక కేంద్రంలో ఉన్న బీజేపీ ఎంత అంటూ ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకి వస్తే గంగానదిని స్వచ్ఛంగా మారుస్తామంటూ బీజేపీ చెప్పిందని... అధికారంలోకి వచ్చాక కొంతమేర పనులు చేపట్టి, ఆ తర్వాత చేతులు దులిపేసుకుందని విమర్శించారు. మతత్వాన్ని పెంచి పోషిస్తూ, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోందని మండిపడ్డారు. దక్షిణ కన్నడలోని మంజేశ్వరలో ఉన్న శాంతి సేనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ, పైవ్యాఖ్యలు చేశారు. 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos