ప్రకాష్‌ రాజ్‌ `మా` ఎన్నికల అధికారికి లేఖ రాశారు. `మా` ఎన్నికల పోలింగ్‌ రోజు, పోలింగ్‌ ప్రాంతంలో చోటు చేసుకున్న సంఘటనలు బయటకు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు ఆయన సీసీ ఫుటేజీని తమకి ఇవ్వాలని ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కి ప్రకాష్‌ రాజ్‌ లేఖ రాశారు.  

`మా` ఎన్నికలు పూర్తయినా దాని తాలుకూ వివాదాలు తగ్గడం లేదు. అసలు కథ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది అని ఎన్నికల అనంతరం కొందరు వ్యాఖ్యానించినట్టు అసలు రచ్చ ఇప్పుడే ప్రారంభమైనట్టు అనిపిస్తుంది. ఎన్నికల ఫలితాల రోజు మోహన్‌బాబు, మంచు విష్ణు పలు వివాదాస్పద కామెంట్లు చేశారు. తమని రెచ్చగొడుతున్నారంటూ మండిపడ్డారు. ఆ వ్యాఖ్యలు చిరంజీని ఉద్దేశించే అనే వార్తలొచ్చాయి. అదే సమయంలో తనని చిరంజీవి తప్పుకోమన్నారని మంచు విష్ణు ఓపెన్‌గానే చెప్పారు. ఇది వివాదంగా మారింది.

అనంతరం prakash raj ప్యానెల్‌ లో గెలిచిన సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. తాము ఈ కొత్త కార్యవర్గంలో కొనసాగలేమని స్పష్టం చేశారు. మూకుమ్మడిగా రాజీనామా ప్రకటించారు. దీంతో `మా`లో కొత్త వివాదాలు ప్రారంభమయ్యాయి. తాజాగా ప్రకాష్‌ రాజ్‌ maa election అధికారికి లేఖ రాశారు. `మా` ఎన్నికల పోలింగ్‌ రోజు, పోలింగ్‌ ప్రాంతంలో చోటు చేసుకున్న సంఘటనలు బయటకు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు ఆయన సీసీ ఫుటేజీని తమకి ఇవ్వాలని ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కి ప్రకాష్‌ రాజ్‌ లేఖ రాశారు. 

Scroll to load tweet…

ఆ లేఖని ప్రకాష్‌రాజ్‌ ట్విట్టర్‌ ద్వారా సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఇందులో ఆయన చెబుతూ `మా` ఎన్నికల్లో జరిగిన అనేక దురదృష్టకర సంఘటనలకు మీరు సాక్షులు. ఆ రోజు మోహన్‌బాబు, మాజీ మా అధ్యక్షుడు నరేష్‌ ల వికృతి, సామాజిక వ్యతిరేక ప్రవర్తనని మేం చూశాం. వారు మా సభ్యులను దూషించారు. బెదిరించారు. శారీరకంగా దాడి చేశారు. పోలింగ్‌ కేంద్రంలోకి వారి అనుచరులను అనుమతించారు. దాంట్లో మీరు మీ విచక్షణాధికారాలను ఉపయోగించారని అనుకుంటున్నా. 

కొన్ని విజువల్స్ మీడియాకి లీక్‌ అయ్యారు. `మా` ఎన్నికల తర్వాత జరిగిన సంఘటనలు ప్రజల దృష్టిలో మాకు నవ్వు తెప్పించాయి. తెలిసిన కొన్ని ముఖాల ప్రవర్తన పట్ల అసహ్యంగా ఉంది. `మా` సభ్యులు కూడా ఈ నివేదికల గురించి నిజం తెలుసుకోవాలనుకున్నారు. పోలింగ్‌ సమయంలో ఆ కేంద్రంలో సీసీ కెమెరాల వినియోగం గురించి మాట్లాడుకున్నాం. అందులో ప్రతిదీ రికార్డ్ చేశారని నేను నమ్ముతున్నా. కాబట్టి మాకు సీసీటీవీ ఫుటేజ్‌ని ఇవ్వమని కోరుతున్నా. ఎన్నికలకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని పొందడం మన ప్రజాస్వామ్య హక్కు. ఒక పోలింగ్‌ అధికారిగా అన్ని రికార్డులను కనీసం మూడు నెలలు భద్రపరడం మీ విధి. అనేక సుప్రీం కోర్ట్ తీర్పులు కూడా పోలింగ్‌ అధికారులను రికార్డులను భద్రపరమని ఆదేశించాయి. 

also read: పెదరాయుడిలా సింహాసనంపై కూర్చుని.. అన్నయ్యకు అంత అహంకారం లేదు, నాగబాబు కామెంట్స్

కాబట్టి సాధ్యమైనంత త్వరగా మాకు సీసీ టీవీ ఫుటేజ్‌ని ఇవ్వమని మిమ్మల్ని అభ్యర్ధిస్తున్నా. మీరు వెంటనే చర్య తీసుకోకపోతే, ఫుటేజ్‌ తొలగించబడుతుందని, ట్యాంపరింగ్‌ అయ్యే అవకాశాలున్నాయని భయంగా ఉంది. దయజేసి ఈ లేఖని అంగీకరించండి` అని తెలిపారు ప్రకాష్‌రాజ్‌. సీసీ టీవీ ఫుటేజ్‌ ద్వారా అసలు ఆ రోజు ఏం జరిగిందనే విషయాలు బయటకు వస్తాయని, ప్రజలకు తెలుస్తుందని వెల్లడించారు ప్రకాష్‌రాజ్‌. దీంతో ఇప్పుడు `మా`లో సరికొత్త వివాదానికి తెరలేపినట్టయ్యింది. మరి నిజంగానే సీసీటీవీ ఫుటేజ్‌ బయటకు వస్తే ఏం జరగబోతుంది, ప్రస్తుతం ఆ ఫుటేజ్‌ ఉందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.

2021-23కిగానూ `మా` ఎన్నికలు గత ఆదివారం ఫిల్మ్ నగర్‌లోని జూబ్లి పబ్లిక్‌ స్కూల్‌ లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ప్రకాష్‌ రాజ్‌, మంచు విష్ణు `మా` అధ్యక్షుడి పదవి కోసం పోటీ పడగా, మంచు విష్ణు, ఆయన ప్యానెల్‌ గెలుపొందింది. మంచు విష్ణు బుధవారం `మా` అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు కూడా తీసుకున్న విషయం తెలిసిందే.