Asianet News TeluguAsianet News Telugu

పెదరాయుడిలా సింహాసనంపై కూర్చుని.. అన్నయ్యకు అంత అహంకారం లేదు, నాగబాబు కామెంట్స్

'మా' ఎన్నికల హీట్ రగులుతూనే ఉంది. ఎన్నిక ముగిసినప్పటికీ కోపతాపాలు చల్లారడం లేదు. మంచు విష్ణు విజయం సాధించిన తర్వాత ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు మూకుమ్మడిగా మా సభ్యత్వానికి రాజీనామా చేయడం సంచలనంగా మారింది.

Nagababu clarifies that chiranjeevi never wanted to be like that
Author
Hyderabad, First Published Oct 13, 2021, 3:59 PM IST

'మా' ఎన్నికల హీట్ రగులుతూనే ఉంది. ఎన్నిక ముగిసినప్పటికీ కోపతాపాలు చల్లారడం లేదు. మంచు విష్ణు విజయం సాధించిన తర్వాత ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు మూకుమ్మడిగా మా సభ్యత్వానికి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. దీనితో ఇప్పటికి విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా నరేష్ వ్యవహారం మాలో చర్చనీయాంశంగా మారుతోంది. 

Naresh వ్యాఖ్యలకు మెగా బ్రదర్ నాగబాబు ఎప్పటికప్పుడు కౌంటర్ ఇస్తూనే ఉన్నారు. ఇటీవల నరేష్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా నాగబాబు తాజాగా మరికొన్ని వ్యాఖ్యలు చేశారు. చిత్ర పరిశ్రమకు పెద్దలా వ్యవహరించాలని తన అన్నయ్య చిరంజీవి ఎప్పుడూ కోరుకోలేదని నాగబాబు అన్నారు. 

Also Read: ముండమోసినట్లు ఏడుస్తున్నారు.. అనసూయ ఓటమి, ప్రకాష్ రాజ్ ప్యానల్ వైఖరిపై నరేష్ హాట్ కామెంట్స్

కానీ కష్టం అంటూ తన వద్దకు వచ్చిన వారికి చేతనైన సాయం చేయడం మాత్రం Chiranjeeviకి తెలుసు అని అన్నారు.  ఆధిపత్యం చెలాయించాలని ఎప్పుడూ అనుకోలేదని అన్నారు. సింహాసనంపై కూర్చుని పెదరాయుడిగా పెత్తనం చలాయిస్తానని చిరంజీవి గారు ఎప్పుడూ అనలేదని నాగబాబు అన్నారు. మెగా ఫ్యామిలీ అనే పదం మీడియా సృష్టి అని Nagababu వ్యాఖ్యానించారు. చిరంజీవి గారు అహంకారి కాదు.. డౌన్ టు ఎర్త్ ఉండే మనిషి అని తెలిపారు. 

Also Read: రాధికా ఆప్టే బోల్డ్ షో.. బిగుతైన ఎద అందాలతో మామూలు రచ్చ కాదుగా!

MAA అసోసియేషన్ లో ప్రాంతీయ వాదం ఉండదని భావించా.. విశాల హృదయంతో వ్యవహరిస్తారు అని అనుకున్నా. కానీ ఫలితాలు చూశాక నా అంచనా తప్పని తేలింది. ఇలాంటి సంకుచిత భావాలు ఉండే అసోసియేషన్ లో కొనసాగలేను. అందుకే సభ్యత్వానికి రాజీనామా చేశా. ఇక తిరిగి 'మా'లోకి వచ్చే ప్రసక్తే లేదు అని నాగబాబు తేల్చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios