Prabhas Visited Sirivennela Home: సిరివెన్నెల కుటుంబాన్ని పరామర్శించిన ప్రభాస్.. స్వయంగా ఇంటికి వెళ్లి..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సిరివెన్నెల సీతరామశాస్త్రికి నివాళి అర్పించారు. సిరివెన్నెల ఇంటికి స్వయంగా వెళ్లిన ప్రభాస్ ఆయన కుటుంబాన్ని పరామర్శిచారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సిరివెన్నెల సీతరామశాస్త్రికి నివాళి అర్పించారు. సిరివెన్నెల ఇంటికి స్వయంగా వెళ్లిన ప్రభాస్ ఆయన కుటుంబాన్ని పరామర్శిచారు.
అనారోగ్యంతో మరణించిన సినీ సాహిత్య దిగ్గజం సిరివెన్నెల సీతారామ శాస్త్రి కుటుంబాన్ని పరామర్శించారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. మంగళవారం సాయంత్ర సిరివెన్నల నివాసానికి స్వయంగా వెళ్లిన ప్రభాస్ ఆయన కుటుంబ సబ్యులతో మాట్లాడారు. ఆయన తో వర్క్ చేసిన రోజులను గుర్తు చేసుకున్నారు ప్రభాస్. సిరివెన్నెల కుమారులు యోగేష్, రాజాలతో మాట్లాడారు. కొద్ది సేపు వారి ఫ్యామిలీతో గడిపిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. వారిని ఓదార్చారు. ప్రభాస్ వెంట కమెడియన్ కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రభాస్ శ్రీను కూడా ఉన్నారు. ప్రభాస్ రావడంతో చుట్టుపక్కల జనంతో అక్కడ ప్రాంతం అంతా నిండిపోయింది.
గత ఏడాది నవంబర్ 30న మరణించారు సిరివెన్నెల సీతారామ శాస్త్రీ. ఊపిరితిత్తులు సమస్యతో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు సిరివెన్నెల. అప్పట్లో సినిమాల హడావిడిలో ఉన్న ప్రభాస్ స్వయంగా సిరివెన్నల కుటుంబాన్ని కలవలేక పోయారు. ప్రభాస్ కు ఎన్నో సూపర్ హిట్ పాటలు రాశారు సిరివెన్నెల. అందులో ముఖ్యంగా చక్రం సినిమాలో జగమంత కుటుంబం నాది పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సినిమా ప్లాప్ అయినా.. ఈ పాట మాత్రం మారుమోగిపోయింది. ఇప్పటికీ జగమంత కుటుంబం పాట వింటే మైమరచిపోయే ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు.
సిరివెన్నల కుటుంబంలో సీతారామ శాస్త్రితో పాటు ఆయన కుమారులతో కూడా ప్రభాస్ కు పరిచయం ఉంది. సిరివెన్నెల చిన్న తనయుడు రాజా ఇండస్ట్రీలో స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నాడు. పెద్ద కొడుకు యోగేష్ మ్యూజిక్ డైరెక్టర్ గా తన లక్ ను పరీక్షించుకున్నారు. ఇందులో రాజా మాత్రమే సక్సెస్ ఫుల్ గా తన మూవీ కేరీర్ ను లీడ్ చేస్తున్నాడు. సిరివెన్నెల చనిపోయిన నెల రోజులు తరువాత ప్రభాస్ వచ్చి పరామర్శించడం ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయ్యింది.
Also Read : రియల్ హీరో సోనూసూద్ ఖాతాలో మరో సేవ.. వెయ్యి మంది విద్యార్థినీలకు సైకిళ్ల పంపిణీ..