రియల్ హీరో సోనూసూద్ ఖాతాలో మరో సేవ.. వెయ్యి మంది విద్యార్థినీలకు సైకిళ్ల పంపిణీ..
మరోసారి తాను హీరో అనిపించుకున్నారు సోనూసూద్. 2021 అంటే సోనూసూద్ అనేలా తన సేవా కార్యక్రమాలు విస్తరించారు. ఇప్పటికీ తన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. తాజాగా సైకిళ్లు పంపిణీ చేశారు.
సోనూసూద్(Sonu Sood).. ఇప్పుడు నేషనల్ వైడ్‌గా రియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2020 నుంచి కరోనా సమయంలో ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలే ఆయన్ని రియల్ హీరోగా నిలిపాయి.దీంతో ఇప్పుడు అభిమానులు ఆయన్ని సూపర్ హీరోగా పిలుచుకుంటున్నారు. కరోనా ఫస్ట్ వేవ్‌లో వలసకార్మికులను ఆదుకుని, వారిని సురక్షితంగా స్వస్థలాలకు పంపించి తన గొప్ప మనసుని చాటుకున్నారు Sonu Sood. ఆ తర్వాత ఆపదలో ఉన్న వారికి తనవంతు సాయం చేస్తూ వస్తున్నారు. తన సాయం కోరిన కొందరు పేదలు ఇళ్లు కట్టుకునేందుకు సాయం అందించడం, చదువుకు సంబంధించిన అవసరాలను తీర్చడం, ఆనారోగ్యంతో బాధపడుతున్న వారికి సరైన ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ అందించడం చేశాడు.
ఇక సెకండ్ వేవ్‌లో కరోనా పేషెంట్లకి ఆక్సిజన్ సిలిండర్లు, బెడ్స్ , వెంటిలేటర్స్ అందించడంలో నిరంతరం శ్రమించాడు. మరోసారి తాను హీరో అనిపించుకున్నారు. 2021 అంటే సోనూసూద్ అనేలా తన సేవా కార్యక్రమాలు విస్తరించారు. ఇప్పటికీ తన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. పేద విద్యార్థులకు సివిల్స్ కోచింగ్ ఇప్పిస్తున్నారు. తాజాగా విద్యార్థినీలకు సైకిల్స్ పంపిణీ చేశాడు సోనూ సూద్. తనసొంత టౌన్ అయిన మొగా(పంజాబ్)లో వెయ్యి సైకిళ్లని అందించి తన గొప్ప హదయాన్ని చాటుకున్నారు. `మోగాకి బేటి` కార్యక్రమం పేరుతో తన సోదరి మాళవిక సూద్ సచార్‌తో కలిసి మంగళవారం సైకిళ్లని అందించారు. స్కూల్ గర్ల్స్ కి, సామాజిక కార్యకర్తలకు కలిపి వెయ్యి సైకిళ్లని అందించారు. మొగా సమీపంలోని 40-45 గ్రామాలకు చెందిన విద్యార్థినీలు ఈ ప్రయోజనం పొందారు.
ఈ సందర్భంగా సోనూ సూద్ మాట్లాడుతూ, ఇంటి నుంచి దూరంగా ఉండే స్కూల్స్ కి వెళ్లాల్సిన విద్యార్థినీలు చలిలో వెళ్లడం కష్టమవుతుంది. ఈ సమస్యని అరికట్టాలని, అందుకు వారికి సహాయపడాలని మేం అర్హులైన బాలికలకు సైకిళ్లని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 8వ తరగతి నుంచి 12వ తరగతి వరకు బాలికలకు, అలాగే సామాజిక కార్యకర్తలకు సైకిళ్లని అందించాం` అని తెలిపారు. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు పేద కుటుంబాలకు చెందిన అర్హులైన బాలికలను గుర్తించారని తెలిపారు. సోనూ సూద్ సోదరి మాళవికా సూద్ సచార్ ప్రముఖ ఫిలాంథ్రపిస్ట్, అలాగే సూద్ ఛారిటీ ఫౌండేషన్‌లో యాక్టివ్‌గా ఉన్నారు.
also read: కుందనపు బొమ్మలా మెరిసిపోతూ సమంత కనువిందు.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్.. గతాన్ని మర్చిపోలేకపోతుందా ?