నేడు(జనవరి 5) దీపికా పదుకొనె పుట్టిన రోజుని జరుపుకుంటోంది. ఆమె 36వ బర్త్ డే ని సెలబ్రేట్‌ చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌.. దీపికాకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. దీపికాపై ప్రశంసలు కురిపించారు.

దీపికా పదుకొనె(Deepika Padukone) ఇండియన్‌ లేడీ సూపర్‌స్టార్‌గా పేరుతెచ్చుకుంటున్నస్టార్‌ హీరోయిన్‌. ఆమె నటించిన `బాజీరావు మస్తానీ`, `పద్మావతి` చిత్రాలు ఆమె రేంజ్‌ని పెంచేశాయి. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తుంది. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ ల్లో నటిస్తున్న Deepika ఇప్పుడు తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది. ప్రభాస్‌(Prabhas)తో `ప్రాజెక్ట్ కే`(Project K) చిత్రంలో నటిస్తుంది.

ఇదిలా ఉంటే నేడు(జనవరి 5) దీపికా పదుకొనె పుట్టిన రోజుని జరుపుకుంటోంది. ఆమె 36వ బర్త్ డే ని సెలబ్రేట్‌ చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌.. దీపికాకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. దీపికాపై ప్రశంసలు కురిపించారు. `అందమైన చిరునవ్వుతో కూడిన అమ్మాయి దీపికా పదుకొనెకి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆమె తన ఎనర్జీతో, టాలెంట్‌తో ప్రాజెక్ట్ కే సెట్‌లో వెలుగులు నింపేది. మీకు ఎల్లప్పుడూ శుభాకాంక్షలు` అని తెలిపారు ప్రభాస్‌. 

Scroll to load tweet…

`మహానటి`తో విశేష గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ `ప్రాజెక్ట్ కే` చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇది పాన్‌ ఇండియాని మించి పాన్‌ వరల్డ్ స్థాయిలో ఉండబోతుందని వెల్లడించారు. సైన్స్ ఫిక్షన్‌గా రూపొందిస్తున్న ఈ చిత్రం ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే. మొదటి షెడ్యూల్‌ షూటింగ్‌లో దీపికా పదుకొనె, ప్రభాస్‌ కలిసి నటించారు. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీ పతాకంపై అశ్వనీదత్‌ దాదాపు ఐదు వందల కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. 

ఇక దీపికా పదుకొనె.. మూడేళ్ల క్రితం బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అత్యంత గ్రాండ్‌గా వీరి వివాహం జరిగింది. ఇక ఇటీవల `83` చిత్రంలో రోమి పాత్రలో కనువిందు చేసిన దీపికా పదుకొనె `గేహ్రాయాన్‌`, `పఠాన్‌` చిత్రాల్లో నటిస్తుంది. `ప్రాజెక్ట్ కే` చిత్రంతో ఇక దీపికా కూడా టాలీవుడ్‌ కథానాయికల జాబితాలో చేరిపోయింది. ప్రస్తుతం బాలీవుడ్‌ హీరోయిన్లు టాలీవుడ్‌పై ఆసక్తిని చూపిస్తున్న విషయం తెలిసిందే. అలియాభట్‌, కృతి సనన్‌, అనన్య పాండే, కియారా అద్వానీ తెలుగులో సినిమాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దీపికా కూడా తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతుండటం విశేషంగా చెప్పొచ్చు. 

ప్రభాస్‌ ప్రస్తుతం `రాధేశ్యామ్‌` చిత్రంలో నటించగా, ఇది సంక్రాంతికి విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా వాయిదా వేశారు. మరోవైపు ప్రశాంత్‌ నీల్‌తో `సలార్‌`, ఓం రౌత్‌తో `ఆదిపురుష్‌` చిత్రాలు చేస్తున్నారు. ఇవి చిత్రీకరణ దశలో ఉన్నాయి. వీటితోపాటు `అర్జున్‌రెడ్డి` ఫేమ్‌ సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో `స్పిరిట్‌` చిత్రం చేయనున్నారు. ఇందులో ఆయన పోలీస్‌పాత్రలో కనిపించబోతున్నట్టు టాక్‌. 

also read: Radheshyam Postponed: రాధేశ్యామ్‌ వాయిదా.. మీ ప్రేమతో మళ్లీ వస్తాం..

also read: HBD Deepika Padukone: వయసు పెరిగేకొద్దీ వైన్ బాటిల్ లా.. క్రేజ్ పెంచుకుంటున్న ప్రభాస్ హీరోయిన్