MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • HBD Deepika Padukone: వయసు పెరిగేకొద్దీ వైన్ బాటిల్ లా.. క్రేజ్ పెంచుకుంటున్న ప్రభాస్ హీరోయిన్

HBD Deepika Padukone: వయసు పెరిగేకొద్దీ వైన్ బాటిల్ లా.. క్రేజ్ పెంచుకుంటున్న ప్రభాస్ హీరోయిన్

బాలీవుడ్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతుంది దీపికా పదుకోనే.. పెళ్ళి తరువాత కూడా ఏమాత్రం క్రేజ్ తగ్గని బాలీవుడ్ బ్యూటీ బర్త్ డే స్పెషల్ మీకోసం.

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 05 2022, 12:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

దీపికా పదుకొనే(Deepika Padukone).. సౌత్ నుంచి బాలీవుడ్ చేరి.. దాదాపు 15 ఏళ్ళు బాలీవుడ్ ను ఏలుతున్న స్టార్ హీరోయిన్. లెక్కలేనంత మంది అభిమానులు.. కోట్ల మంది సోషల్ మీడియా ఫాలోవర్స్ తో తిరుగు లేని ఇమేజ్ సాధించి.. తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని  సంపాధించుకున్న దీపికా... ఈరోజు ( జనవరి 05) 36వ ఏట అడుగు పెడుతుంది.  

29

వయస్సు పెరిగే కొద్ది ఫాలోయింగ్ పెంచుకుంటూ పోతుంది దీపిక పదుకొనే..పెళ్ళి తరువాత కూడా దీపికా(Deepika Padukone) క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. స్టార్ హీరోల సరసన వరుస ఛాన్స్ లు సాధిస్తూనే ఉంది. యూనివర్సల్ స్టార్ ప్రభాస్ జోడీగా పాన్ ఇండియా మూవీ ప్రాజెక్ట్ కేలో నటిస్తోంది దీపికా. యంగ్ టాలెంటెడ్ టాలీవుడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తన్న ఈమూవీ ఫస్ట్ షెడ్యూల్ కూడా కంప్లీట్ అయ్యింది. రీసెంట్ గా హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన షూటింగ్ లో కూడా జాయిన్ అయ్యింది దీపికా.

39

ఫస్ట్ షెడ్యూల్లో ప్రభాస్(Prabhas)-దీపికా మధ్య సన్నీవేశాలు చిత్రీకరించారు టీమ్. తెలుగు సినిమా షూటింగ్ కు వచ్చినందకు తనను చాలా మర్యాదగా చూసుకున్నారని. ఎంతో గౌరవం ఇచ్చారని తెగ మురిసి పోయింది దీపికా. మంచి  మంచి తెలుగు వంటలు రుచి చూశాన న్నారు. అంతే కాదు తెలుగు ఆడపడుచులకు ఇచ్చినట్టు పట్టుచీర,బొట్టు. గాజులు, పసుపు, కుంకుమతో ఆమెను సత్కరించారు కూడా. ఇక ఈ విషయాలను సోషల్ మీడియాలో శేర్ చేసుకుని తెగ సంబర పడిపోయింది దీపికా పదుకొనే(Deepika Padukone).

49

కన్నడ సినిమా ఐశ్వర్యతో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన దీపికా... చిన్నగా బాలీవుడ్ చేరింది. ఓం శాంతీ ఓం , చెన్నై ఎక్స్ ప్రెస్, యే జవానీ హై దివానీ,  లాంటి సినిమాలతో పాటు బాజీరావ్ మస్తాని, పద్మావత్.. వంటి పీరియాడిక్ సినిమాలతో  సూపర్ డూపర్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకుని టాప్ హీరోయిన్ గా వెలుగు వెలుగుతుంది దీపికా. అసలు పెళ్ళి తరువాత హీరోయిన్ల పని అయిపోతుంది అంటారు. కాని ఈ ట్రెండ్ కు పుల్ స్టాప్ పెట్టి...హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ తో పాటు కమర్షియల్ సినిమాలు.. స్టార్ హీరోల తో సినిమాలు చేస్తుంది దీపికా. ఇప్పటికీ బిజీ షెడ్యూల్స్ తో గడిపేస్తుంది.

59

బాలీవుడ్ యంగ్ స్టార్.. తనకు కో స్టార్ అయిన రణ్ వీర్ సింగ్( Ranveer Sing) ను ప్రేమించి పెళ్శి చేసుకుంది దీపికా. అర్ధం చేసుకునే బర్త దొరకడంతో మారీడ్ లైఫ్ ను హ్యాపీగా లీడ్ చేస్తుంది. రీసెంట్ గా తన భర్త రణ్ వీర్ సింగ్ తో కలిసి.. కపిల్ దేవ్ బయెపిక్ గా తెరకెక్కిన 83 మూవీలో సందడి చేసింది. బాలీవుడ్ తో పాటు అటు హాలీవుడ్ ఆఫర్లు కూడా కొట్టేస్తుంది స్టార్ హీరోయిన్.

 

69

ఛపాక్ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో తన నట విశ్వరూపం చూపించింది బీ టౌన్ బ్యూటీ. ఇండ్ట్రీకి వచ్చిన కొత్తలో ఐరన్ లెట్ అనే ముద్ర వేసుకుంది. రణ్ భీర్ కపూర్ తో బ్రేకప్ తన జీవితాన్ని మార్చేసినా.. డీప్ డిప్రెషన్ లోకి వెళ్ళి.. మళ్ళీ..అందులోంచి స్పీడ్ గా  బయటకు వచ్చేసింది స్టార్ హీరోయిన్.అంతే కాదు ఓ స్వచ్ఛంద సంస్థను స్థాపించి.. డిఫ్రెషన్ తో మానసికంగా కుండి పోయిన వారికి సాయం చేస్తుంద. మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యం అంటుంది దీపికా. మనసే అందమైనదంటుంది.

79

దీపికా పదుకోనే ఫరా ఖాన్ డేరెక్ట్ చేసిన ఓం శాంతి ఓం ఆమె కెరీర్ లో అతి పెద్ద హిట్ గా నిలిచింది. 2007 లో వచ్చిన ఈ సినిమాలో షారుఖ్ జోడీగా  దీపికా వావ్ అనిపించుకున్నారు. పునర్జన్మల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా మంచి మ్యజికల్ హిట్ కూడా అయ్యింది. ఆతరువాత 2013లో వచ్చి యే జవాని హై దివానీ సినిమా హయ్యస్ట్ గ్రాసింగ్ బాలీవుడ్ మూవీ గా రికార్డ్ క్రియేట్ చేసింది. అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో  వచ్చిన యే జవానీ హై దివానీ ఆడియన్స్ కు అలా గుర్తుండి పోయింది.  ఈసినిమాలో దీపికా డాన్స్ కు ఫిదా అవ్వని వారు ఉండరేమో.

89

ఇక దీపికా లైఫ్ లో మర్చిపోలేని సినిము ఇచ్చారు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీ.  ఆయన తెరకెక్కించిన గోలియోం కీ రాస్ లీలా  రామ్ లీలా సినిమాలో దీపికా పర్ఫామెన్స్ పీక్స్ లో ఉంటుంది. ఆమె నటకు విమర్షకులు సైతం ఫిదా అయ్యారు. ప్రపంచ ప్రఖ్యాత రైటర్ షేక్స్ పియార్ రాసిన రోమియో అండ్ జూలియట్ ను ప్రేరణగా తీసుకుని తెరకెక్కిన సినిమాకు దీపికా ప్రాణం పోశారు. ఈ మూవీలో డోల్ బాజే సాంగ్ ఇప్పటికీ.. ప్రతీ చోటా.. ప్రతీ నోటా వినిపించాల్సిందే. ప్రతీ పెళ్లి సంగీతో లో  ఈపాట వినిపించాల్సిందే.

 

99

సంజల్ లీలా భన్సాలీ తెరకెక్కించిన పద్మావతి సినిమా అయితే చెప్పనక్కర్లేదు. రణ్ వీర్ సింగ్ (Ranveer sing) తో కలిసి దీపికా ఈ సినిమాలో నటించింది. ఈమూవీలో దీపిక చేసిన నటనకు ఎన్ని ఆస్కార్లు ఇచ్చినా తక్కవే అనిపిస్తుంది. అంతలా  ప్రభావింతం చేస్తుంది ఈ సినిమాలో దీపికా. ఇలా తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్న దీపికా పదుకోనే.. ట్రెండ్ ను బట్టి తనను తాను మార్చుకంటూ.. సినిమా ప్రయాణాన్ని కొనసాగిస్తుంది.

 

 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Puneeth Rajkumar: అప్పు చెప్పిన స్పెషల్ చిత్రాన్నం.. పునీత్‌ అసలైనదే మర్చిపోయాడు, నవ్వులే నవ్వులు
Recommended image2
Brahmamudi: రోడ్డుపై రాజుకు బుద్ధి చెప్పిన ఇందు..ఇన్విజిలేటర్ కు దొరికిపోయిన ఐశ్వర్య
Recommended image3
Illu Illalu Pillalu: రైస్ మిల్లుకు ఇక రామరాజు పూర్తిగా దూరం, అధికారం వల్లి తండ్రి చేతుల్లోకి...
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved