Asianet News TeluguAsianet News Telugu

ట్రెండింగ్ లో “సలార్” హ్యాష్ ట్యాగ్ …అసలు కారణం తెలుసా!

ప్రభాస్ ఏ పాత్ర చేస్తున్నారు..ఆయన  లుక్ ఎలా ఉండబోతోంది అంటూ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  తాజాగా సలార్ చిత్రం టైటిల్ ట్యాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందుకు కారణం ఏమిటనేది చాలా మందికి అంతు చిక్కటం లేదు. అయితే అసలు విషయం వేరేగా ఉంది.
 

Prabhas Salaar hash tag in trending
Author
Hyderabad, First Published Oct 19, 2021, 3:25 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

పాన్‌ఇండియన్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతోన్న పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సలార్‌’. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్నారు.  ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇందులో ప్రభాస్ ఏ పాత్ర చేస్తున్నారు..ఆయన  లుక్ ఎలా ఉండబోతోంది అంటూ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  తాజాగా సలార్ చిత్రం టైటిల్ ట్యాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందుకు కారణం ఏమిటనేది చాలా మందికి అంతు చిక్కటం లేదు. అయితే అసలు విషయం వేరేగా ఉంది.

  ప్రభాస్ బర్త్ డే మంత్, ప్రభాస్ బర్త్ డే వీక్ అంటూ ఇప్పటికే కొన్ని హ్యాష్ ట్యాగ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. కాగా, ఇప్పుడీ ట్రెండింగ్ వెనక సీక్రెట్ ఏమిటంటే.. సలార్ చిత్రం నుండి ప్రభాస్ గన్స్ పట్టుకొని కాల్చుతున్న వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ వీడియో లెంగ్త్ చాలా తక్కువగా ఉన్నప్పటికీ ప్రభాస్ సినిమాలో ఎలా ఉండబోతున్నాడు అనేది క్లూ ఇచ్చినట్లైంది. దాంతో  ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ నేపధ్యంలో  ప్రభాస్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. మరికొందరు అయితే ఈ చిన్న వీడియో కే ఇంతగా ట్రెండ్ అవుతోంది అంటే, ఇక టీజర్ లేక ట్రైలర్ విడుదల అయితే ఏ రేంజిలో ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. లీక్డ్ వీడియో చూస్తుంటే ప్రభాస్ కటౌట్ కి ఇండియన్ బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం చెప్తున్నారు.  

ఇక ఈ చిత్రం గురించిన మరో విషయం ఏమిటంటే..  ఈ సినిమా 1970లో జరుగుతుంది. అప్పటి పాకిస్దాన్,ఇండియా వార్ నేపధ్యంలో ఉండబోతోంది. ఇందులో ప్రభాస్ ఓ సైనికుడుగా కనిపించబోతున్నాడని అంటున్నారు. ఆ వార్ అయిన తర్వాత అతను గ్యాంగస్టర్ గా మారే వైనం, ఆ క్రమంలో జరిగే సంఘటనల చుట్టూ కథనం నడుస్తుందని కన్నడ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అలాగే  విజువల్ ట్రీట్ ఇచ్చే క్రేజీ ఎలివేషన్స్ తో ఫైట్ సీక్వెన్సులను దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడట.అయితే ఇందులో ఎంతవరకూ నిజం అనేది తెలియాల్సి ఉంది. హోంబలే ఫిల్మ్స్‌ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు. శ్రుతిహాసన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇటీవల ప్రారంభమైన షెడ్యూల్‌లో ప్రభాస్‌-శ్రుతిహాసన్‌లకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.

Aslo read నాని పై ట్వీట్స్ ఎటాక్ ...దారుణ ట్రోలింగ్, ఇప్పుడెందుకంటే
 
గ్యాంగస్టర్ గా ప్రభాస్ కనిపించే సీన్స్ షూట్ చేసారని తెలుస్తోంది. సినిమాలో భారీ ఎలివేషన్ సీన్స్ అవి అని తెలుస్తోంది.  మరో ప్రక్క దర్శకుడు  ప్ర‌శాంత్ నీల్ ఈ చిత్రం స్క్రీన్ ప్లే లో చిన్న మార్పులు చేశారని తాజాగా ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ చిత్రంలో చిన్న ప్లాష్ బ్యాక్ యాడ్ చేశారట. ఈ ప్లాష్ బ్యాక్ లో ఓ బాలీవుడ్ సీనియర్ స్టార్ కనిపిస్తాడని.. ఈ ప్లాష్ బ్యాక్ మొత్తం చిత్రానికే హైలైట్‌ గా నిలుస్తుందని చెప్పుకుంటున్నారు. ఈ ప్లాష్ బ్యాక్ లో బాలీవుడ్ స్టార్..నెగిటివ్ రోల్ లో కనిపిస్తారని, అదే కథలో రివీల్ అయ్యే మెయిన్ ట్విస్ట్ అంటున్నారు. అప్పటిదాకా ఓ విధంగా నడిచిన కథ హఠాత్తుగా మలుపు తీసుకుంటుందని, ఆ ట్విస్ట్ కనుక వర్కవుట్ అయితే సినిమా స్దాయి చాలా రెట్లు పెరుగుతుందని అంటున్నారు. 

Also read Raashi khanna ప్రైవేట్ ఫోటోలు లీక్ చేసి షాక్ ఇచ్చిన హాట్ హీరోయిన్ రాశి ఖన్నా... రచ్చ చేశామంటూ బోల్డ్ కామెంట్

2021 లోపే ఈ సినిమాని పూర్తి చేయాలని చూస్తున్నాడు ప్రభాస్. అందుకే ప్రభాస్ ఈ సినిమా కోసం బల్క్ డేట్స్ కేటాయించాడట. కేజీఎఫ్ లాంటి హై వోల్టేజ్ మూవీ తీసిన ‘ప్ర‌శాంత్ నీల్’ దర్శకత్వంలో ఈ సినిమా వస్తుండటంతో ఈ సినిమా పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి.  ఈ సినిమాను 2022 ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. ఇందులో కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టితో ఓ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.  
 

Follow Us:
Download App:
  • android
  • ios