Asianet News TeluguAsianet News Telugu

నాని పై ట్వీట్స్ ఎటాక్ ...దారుణ ట్రోలింగ్, ఇప్పుడెందుకంటే

న్యాచురల్ స్టార్ నాని హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల నాని హీరోగా నటించిన టక్ జగదీష్ చిత్రం డైరెక్ట్ గా ఓటిటి లో రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం నాని చేతిలో శ్యామ్ సింగ్ రాయ్, అంటే సుందరానికి సినిమాలు ఉన్నాయి.

Trolls Attack Nani For 2013 Tweets
Author
Hyderabad, First Published Oct 19, 2021, 2:14 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

సోషల్ మీడియా బాగా పాపులర్ అయ్యాక సెలబ్రెటీలకు ట్రోలింగ్ తప్పటం లేదు. ప్రతీ విషయంలోనూ వారు ట్రోల్ చేయబడుతున్నారు. గత రెండు రోజులుగా అల్లు అర్జున్ ని ట్రోల్ తో సోషల్ మీడియా నిండింది. ఇప్పుడు నానిని ట్రోల్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు హఠాత్తుగా నానిని ట్రోల్ చేయటానికి గల కారణం ఏమిటి అనేది ఎవరికి అర్దం కాలేదు. ఆ మధ్యన టక్ జగదీష్ విషయంలో తెగ ట్రోలింగ్ జరిగింది. నాని వివరణ కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు నాని సీన్ లో లేరు. ఆయన పనులు సైలెంట్ గా చేసుకుంటున్నారు. కానీ ఊహించని విధంగా ఒక్కసారిగా ఆయన పాత ట్వీట్స్ అంటే ఎనిమిదేళ్ల క్రితంవి 2013 నాటికి బయిటకు తీసి ట్రోల్ చేస్తున్నారు. 

వాటిల్లో కొన్ని ట్వీట్స్ ప్రో మోడికు సంభందించినవి, మరికొన్ని స్టేట్ బైపరకేషన్ కు సంభందించినవి కావటం గమనార్హం. ఆ ట్వీట్స్ అన్ని ఇప్పుడు రీట్వీట్స్ చేస్తూ మాక్ చేస్తున్నారు. అయితే పాత ట్వీట్స్ ని ఇప్పుడు బయిటకు తీసి అప్పటి అభిప్రాయాలను ఇప్పటిలా చెలామణి చేయటం ఎంతవరకూ సమంజసం అంటున్నారు నాని అభిమానులు. ఏడేళ్లలో చాలా అభిప్రాయాలు మారతాయి. అయినా అప్పటివి ఇప్పుడు మాటలుగా ఎలా చెప్తారు అంటూ మండిపడుతున్నారు. అయితే వీటిని ఎవరు,ఎందుకు బయిటకు తీస్తున్నారు. వారి అసలు ఉద్దేశ్యం ఏమిటనేది మాత్రం అర్దం కావటం లేదు. 

 ఇక  చిత్రాలు విషయానికి వస్తే..  న్యాచురల్ స్టార్ నాని హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల నాని హీరోగా నటించిన టక్ జగదీష్ చిత్రం డైరెక్ట్ గా ఓటిటి లో రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం నాని చేతిలో శ్యామ్ సింగ్ రాయ్, అంటే సుందరానికి సినిమాలు ఉన్నాయి.

Also read వెనక్కి తగ్గనంటున్న మహేష్, 'RRR' కు అడ్డం పడుతుందా?

ఈ రెండింటి లో శ్యామ్ సింగ్ రాయ్ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుందని. అంటే సుందరానికి సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే వీటితో పాటు నాని మరో సినిమా చేయబోతున్నాడు.అవును… తాజాగా తన 29వ సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ ను ఇచ్చారు.

కథ, పాత్ర ఎలాంటిదైన తనదైన సహజ నటనతో దానికి మరింత వన్నె తెచ్చే హీరో నాని. ఆయన నుంచి సినిమా వస్తుందంటే అభిమానులే కాదు, కుటుంబ ప్రేక్షకులు, యువత ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అయితే, గత కొంతకాలంగా నాని అభిమానుల అంచానాలను అందుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో మరో వైవిధ్యమైన, కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 

Also read Unstoppable talk show: బాలయ్యకు షాకింగ్ రెమ్యునరేషన్ ఆఫర్ చేసిన అల్లు అరవింద్

శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో ఆయన హీరో గా నటిస్తున్న చిత్రం ‘దసరా’. కీర్తి సురేశ్‌ హీరోయిన్. పూర్తి తెలంగాణ నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. విజయదశమి పండగ సందర్భంగా విడుదల చేసిన ‘సైరెన్‌ ఆఫ్‌ దసరా’లో ‘జమ్మి వెట్టి జెప్తాన్న బద్దల్ బాసింగాలైతై సూస్‌కుందాం’ అంటూ నాని తెలంగాణ యాసలో చెప్పిన డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. మరి ఈ చిత్ర నేపథ్యం ఏంటి? నాని ఎలా కనిపించనున్నారు? తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ఎస్‌ఎల్‌వీసీ బ్యానర్‌ఫై ఈ చిత్రం తెరకెక్కుతోంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios