ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు శుభ‌వార్త‌స్పీడ్ పెంచిన యంగ్ రెబ‌ల్ స్టార్‌ఏప్రిల్‌27 న సాహో టీజ‌ర్‌
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రన్ రాజా రన్ డైరక్టర్ సుజిత్ డైరక్షన్ లో వస్తున్న సినిమా సాహో. బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. రీసెంట్ గా మొదలైన ఈ సినిమా టీజర్ ఏప్రిల్ 27 సాయంత్రం యూట్యూబ్ లో రిలీజ్ చేస్తారట.
బాహుబలి తర్వాత అదే రేంజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చే ఆలోచనలో ఉన్న ప్రభాస్ సుజిత్ సినిమా కరెక్ట్ అని ఫిక్స్ చేసుకున్నాడు. పోలీసాఫీసర్ గా ప్రభాస్ కనిపించబోతున్న ఈ సినిమాలో ఫైట్స్ కేసం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నారట. మరి టీజర్ తోనే సినిమా ఎలా ఉండబోతుందని చూపించబోతున్నారట. ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఈ టీజర్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
అంతేకాదు బాహుబలి-2 ప్రదర్శించబడుతున్న అన్ని థియేటర్స్ లో ఈ టీజర్ వస్తుందని టాక్. అయితే ఈ విషయంపై దర్శక నిర్మాతలు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. యువి క్రియేషన్స్ పతాకంలో దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది. తెలుగు తమిళ హింది భాషల్లో ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నారట.
