పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రభాస్ నుంచి నెక్ట్స్ థియేటర్లలోకి రాబోతున్న సినిమా రాజా సాబ్. ఈ మూవీ నుంచి ఫ్యాన్స్ దిల్ ఖుష్ అయ్యేలా ఓ అప్ డేట్ వచ్చింది.
ప్రభాస్ సినిమాల కోసం ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తుంటారు. ఇక ప్రభాస్ నుంచి తాజాగా రాబోతున్న సినిమా రాజా సాబ్.మారుతి డైరెక్ట్ చేసిన ఈసినిమా నుంచి అప్ డేట్ కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఇక రాజా సాబ్ కు సంబంధించి తాజా అప్డేట్ ఇప్పుడు అధికారికంగా విడుదలైంది. చాలా రోజులుగా ఎదురుచూస్తున్న అభిమానులను దిల్ ఖుష్ చేస్తూ.. ప్రత్యేకంగా టీజర్ అప్డేట్ ను విడుదల చేసింది.
ఈరోజు విడుదలైన టీజర్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ లో ప్రభాస్ మాస్ గెటప్ లో కనిపించాడు. నల్ల బనీన్ వేసుకొని, ఎర్ర క్లాత్ చేతిలో పట్టుకొని, మంటల మధ్య నిలబడి ఉన్న స్టైలిష్ లుక్ లో కనిపించగా, అభిమానులు ఆయన “డార్లింగ్ మూవీ టైమ్ లుక్ గుర్తుచేసుకుంటున్నారు. ఇక రాజాసాబ్ టీజర్ జూన్ 16న ఉదయం 10:52కి విడుదల కానున్నట్టు ప్రకటించారు. అంతేకాక, సినిమా విడుదల తేదీని కూడా ఈ అప్డేట్‌లో వెల్లడించారు. రాజా సాబ్ సినిమా డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయబోతున్నట్టు వెల్లడించారు టీమ్.

ఈ సినిమాలో ప్రభాస్‌కు సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ లు హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎస్. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. మారుతీ దర్శకత్వం వహిస్తున్న రాజాసాబ్ షూటింగ్ చివరి దశలో ఉండగా అటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా సాగుతున్నాయి.
ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్ర టీజర్, ట్రైలర్‌లు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. టీజర్ పోస్టర్‌కు వస్తున్న స్పందన చూస్తుంటే, ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో అర్ధం అవుతుంది. ప్రభాస్ కెరీర్‌లో ఈసినిమా భారీ బ్లాక్ బస్టర్ అవ్వాలని ప్యాన్స్ కోరుకుంటున్నారు. రాజా సాబ్ హిట్ అయితే ప్రభాస్ కెరీర్ లో మరో హ్యాట్రిక్ హిట్ వచ్చి చేరుతుంది. ఈమధ్యలో వచ్చిన సలార్, కల్కీ సినిమాలతో భారీ హిట్స్ ను సొంతం చేసుకున్నారు టీమ్.
