- Home
- Entertainment
- నయనతారకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ధనుష్, సర్కస్ లు తర్వాత అంటూ ఇచ్చిపడేసిన స్టార్ హీరో.
నయనతారకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ధనుష్, సర్కస్ లు తర్వాత అంటూ ఇచ్చిపడేసిన స్టార్ హీరో.
సౌత్ స్టార్ హీరో ధనుష్ కు కోపం వచ్చింది. ఇక చాలు ఆపండి, మీ సర్కస్ లు నా ముందు కాదు, ఎంత ప్రయత్నంచేసినా ఒక్క ఇటుక కూడా కదపలేరు, పక్కకెళ్లి ఆడుకోండంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు స్టార్ హీరో. ఇంతకీ ఆయన వార్నింగ్ నయనతారకేనా?
- FB
- TW
- Linkdin
Follow Us

చాలా సినిమాల్లో కలిసి నటించారు ధనుష్, నయనతార. కాని ఈమధ్య కాలంలో వారిద్దరి మధ్య కోల్డ్ వార్ గట్టిగా నడుస్తోంది. నయనతార గత ఏడాది తన పెళ్లి డాక్యుమెంటరీని నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేశారు. ఆ డాక్యుమెంటరీ కోసం నానుమ్ రౌడీ ధాన్ సినిమా పాటలను ఉపయోగించుకోవడానికి నయనతార అనుమతి కోరారు. కానీ ఆ సినిమా నిర్మాత అయిన ధనుష్ అనుమతి ఇవ్వలేదు.
ధనుష్ - నయనతార గొడవ
ఆ పాటల అనుమతి కోసం దాదాపు రెండేళ్లు ఆ డాక్యుమెంటరీని విడుదల చేయకుండా వెయిట్ చేసిన నయనతార, చివరికి ఆ పాటలు లేకుండానే డాక్యుమెంటరీని రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత ఆ డాక్యుమెంటరీ ట్రైలర్ విడుదలైనప్పుడు షాకింగ్ విషయం బయటకు వచ్చింది.
అందులో నానుమ్ రౌడీ ధాన్ సినిమా షూటింగ్ స్పాట్‌లో తీసిన కొన్ని సన్నివేశాలు అందులో కనిపించాయి. దాంతో ఆసినిమా నిర్మాత అయిన ధనుష్ తన అనుమతి లేకుండా ఆ సీన్స్ వాడుకున్నారని, ఆ సినిమా హక్కులు తనవేనని నయన్ కు నోటీసు పంపారు.
అంతే కాదు ఆ సన్నివేశాలు తొలగించకపోతే 10 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని ధనుష్ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. దాంతో ధనుష్ నయనతార మధ్య వార్ స్టార్ట్ అయ్యింది. మాటల యుద్దం మొదలయ్యింది. ఒకరికి ఇంకొకరు కౌంటర్ ఇచ్చుకుంటూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేసుకున్నారు. ఇది కాస్తా ఫ్యాన్ వార్ గా కూడా మారిపోయింది.
ధనుష్‌ని విమర్శించిన నయనతార
ధనుష్ నోటీసులు చూసి షాక్ అయిన నయనతార, అతనికి కౌంటర్ ఇస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో, ఆయనను తీవ్రంగా విమర్శించింది నయనతార. ప్రతీ సినిమా ఫంక్షన్ లో అతను మాట్లాడేవన్నీ అబద్దాలని, స్టేజ్ మీద అతను నటిస్తాడని , ఆయన నిజస్వరూపం వేరని విమర్శించారు. దీంతో నయనతారపై ధనుష్ కేసు వేశారు, ప్రస్తుతం అది విచారణలో ఉంది.
తనను విమర్శించి మాట్లాడిన నయనతారకు ఎలాంటి కౌంటర్ ఇవ్వకుండా సైలెంట్ గా ఉన్నాడు ధనుష్. ఎప్పుడు పబ్లిక్ గా ఏం మాట్లాడలేదు. కాని అటు నయనతార ఫ్యాన్స్ కొంత మంది మాత్రం సోషల్ మీడియాలో ధనుష్ ను విమర్శించారు. ఇటు ధనుష్ ఫ్యాన్స్ కూడా నయన్ ను విమర్శించారు. ఇక తాజాగా ఈ వివాదంపై ఇండైరెక్ట్ గా స్పందించాడు హీరో ధనుష్, కుబేరా సినిమా ఆడియో లాంచ్ ఫంక్షన్లో కాస్త ఆవేశంగా మాట్లాడారు.
నయనతారకు కౌంటర్ ఇచ్చిన ధనుష్
ధనుష్ చాలా తెలివిగా నయనతారకు కౌంటర్ ఇచ్చారు. ఆమె పేరు కూడా ప్రస్తావన రాకుండా, ఎవరికి ఈ కామెంట్స్ టచ్ అవ్వాలో వారికి టచ్ అయ్యే విధంగా ఆయన కౌంటర్ ఇచ్చారు. ఆయన మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ధనుష్ నయనతరా గురించే ఈ కామెంట్స్ చేశారని నెటిజన్లు భావిస్తున్నారు.
ఇక ధనుష్ మాట్లాడుతూ : “నా గురించి ఎన్ని వదంతులు కావాలంటే అన్ని వ్యాప్తి చేయండి, ఎలాంటి నెగెటివిటీ కావాలో అంత ప్రచారం చేసుకోండి. ఎప్పుడు చేసుకుంటారో చేసుకోండి, సినిమా పైన చేసిన పర్లేదు. నాకు నా ఫ్యాన్స్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. వారి సపోర్ట్ నాకు ఉన్నంత వరకు నేను ముందుకు సాగుతూనే ఉంటాను.
ఇంకాస్త డోస్ పెంచిన ధనుష్
ధనుష్ ఇంకాస్త డోస్ పెంచి.. తమ్ముళ్ళు కాస్త దూరంగా వెళ్లి ఆడుకోండి రాజా. ఈ సర్కస్ ఇక్కడ అవసరం లేదు. నాకు దారి చూపేది నా అభిమానులే. మీరు నాలుగు రూమర్లు వ్యాప్తి చేసి వెళ్లిపోవాలనుకుంటే, దానికంటే మూర్ఖత్వం మరొకటి లేదు. మీరు ఒక్క ఇటుక కూడా కదల్చలేరు. అని ధనుష్ వార్నింగ్ ఇచ్చారు.