యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాజా సాబ్. మారుతి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.

ప్రభాస్ రాజా సాబ్ మూవీ 

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాజా సాబ్. మారుతి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ ప్రధాన పాత్రలో కనిపించనుండగా, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, సంజయ్ దత్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. జయరాం, అనుపమ్ ఖేర్, జరీనా వహాబ్, ప్రియదర్శి, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం వంటి నటులు సహాయ పాత్రల్లో కనిపించనున్నారు.

టీజర్ రిలీజ్ కి ఏర్పాట్లు 

ఈ చిత్రం చాలా కాలంగా వాయిదా పడుతుండడంతో ఫ్యాన్స్ లో నిరాశ నెలకొంది. కానీ ఫ్యాన్స్ లో జోష్ నింపేలా చిత్ర యూనిట్ జూన్ 16న రాజా సాబ్ టీజర్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. టీజర్ రిలీజ్ కి గ్రాండ్ గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇటీవల టీజర్ ఆన్లైన్ లో లీక్ కావడంతో చిత్ర యూనిట్, అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే టీజర్ లీక్ కావడం.. ఒరిజినల్ టీజర్ అందించే ఎక్స్పీరియన్స్ పై ప్రభావం ఉండకూడదని చిత్ర యూనిట్ భావిస్తోంది. 

రాజా సాబ్ ప్రీ టీజర్ 

టీజర్ హంగామా పెంచేలా చిత్ర యూనిట్ వరుస అప్డేట్లు ఇస్తున్నారు. టీజర్ కి సంబంధించిన ప్రీ టీజర్ ని రిలీజ్ చేశారు. ఈ ప్రీ టీజర్ లో హీరోయిన్లు మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ముగ్గురూ దేనినో ఆశ్చర్యంగా చూస్తూ కనిపిస్తున్నాయి. ఈ ముగ్గురూ దేన్నో చూసి భయపడుతున్నట్లు ప్రీ టీజర్ లో చూపించారు. ప్రీ టీజర్ లో తమన్ బిజియం అదిరిపోయింది. 

YouTube video player

స్టైలిష్ పోస్టర్ 

ఇప్పుడు తాజాగా ఆసక్తికర పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ ప్రభాస్ సూపర్ స్టైలిష్ గా కనిపిస్తున్నారు. కారు టాప్ పై కూర్చుని ఉన్న ఫోజు అదిరిపోయింది. ఈ పోస్టర్ తో టీజర్ ని సోమవారం ఉదయం 10.52 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. 

View post on Instagram

రాజా సాబ్ టీజర్ ని ఆన్లైన్ లో మాత్రమే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాల్లోని థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. రాజమండ్రి, కాకినాడ, గాజువాక, అమలాపురం, అనకాపల్లి, ఒంగోలు, విజయవాడ, మచిలీపట్టణం, భీమవరం, కడప, ప్రొద్దుటూరు లాంటి ప్రాంతాల్లోని థియేటర్స్ లో రాజా సాబ్ టీజర్ రిలీజ్ ఉండబోతోంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. 

View post on Instagram