బలవంతంగా లిప్ కిస్ సన్నివేశం, అది భయంకర అనుభవం అంటూ సీనియర్ హీరోయిన్ కామెంట్స్
రోజా ఫేమ్ నటి మధు తన తొలినాళ్లలో ఎదుర్కొన్న ఓ భయానక ముద్దు సీన్ గురించి వెల్లడించారు. ఆ సీన్‌ను తనకు తెలియకుండానే చిత్రీకరించారని, దాని వల్ల ఇప్పటికీ తాను ఇబ్బంది పడుతున్నానని ఆమె చెప్పారు. ఆ సీన్‌కు ఎలా బలవంతంగా ఒప్పించారో వివరించారు.

తన కెరీర్ ప్రారంభంలో ముద్దు, ఇతర అసభ్యకర సన్నివేశాలను చేయకూడదనే ఉద్దేశంతో చాలా సినిమాలను తిరస్కరించానని రోజా ఫేమ్ నటి మధు వెల్లడించారు.
ఫూల్ ఔర్ కాంటే సినిమాతో కెరీర్ ప్రారంభించిన మధు, తన తొలినాళ్లలో గ్లామర్ పాత్రలు ఎందుకు చేయలేదో ఇటీవల వెల్లడించారు. న్యూస్18తో ఇంటర్వ్యూలో, ఒక ముద్దు సీన్ గురించి మాట్లాడుతూ, ఆ సమయంలో తాను ఎంతో ఇబ్బంది, అసౌకర్యానికి గురయ్యానని చెప్పారు.
తాను సాంప్రదాయ కుటుంబంలో పెరిగానని, తెరపై సన్నిహిత సన్నివేశాల్లో నటించడం తనకు ఇబ్బందికరంగా ఉండేదని మధు చెప్పారు. అందుకే అలాంటి సన్నివేశాలున్న చాలా ప్రాజెక్టులను తిరస్కరించానని ఆమె తెలిపారు.
ఒక సంఘటన గురించి చెబుతూ, తనకు ముందస్తుగా చెప్పకుండానే ఒక ముద్దు సీన్‌లో నటించమని కోరారని మధు తెలిపారు. ఆ సినిమా నటుడి పేరు చెప్పకుండా, “ఇప్పుడు సినిమాల్లో చూపించే ముద్దులాంటిది కాదు. పెదవులపై ముద్దు పెట్టుకున్నట్లు చూపించారు. అది నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది” అని ఆమె అన్నారు.
చిత్రీకరణకు ముందు ముద్దు సీన్ ఉందని చెప్పలేదు. చెప్పినప్పుడు, నన్ను పక్కకు తీసుకెళ్లి చాలాసేపు ఒప్పించారు. ఎందుకు అవసరమో వివరించారు. ఆ విధంగా ఆ లిప్ కిస్ సన్నివేశంలో నటించాల్సి వచ్చింది. కానీ అది నాకు చాలా భయంకరమైన, అసౌకర్యమైన అనుభవం.
ఎడిటింగ్ లో చూస్తే లిప్ కిస్ ఆ సన్నివేశానికి అవసరం లేదని చిత్ర యూనిట్ భావించారు. అంత హంగామా చేసి లిప్ కిస్ ని తొలగించారు. ఇప్పుడు 22, 24 ఏళ్ల నటీమణులు తెలివైనవారు. కానీ నేను 22 ఏళ్ల వయసులో చాలా అమాయకురాలిని. అందుకే కొన్ని సందర్భాల్లో సరైన నిర్ణయాలు తీసుకోలేదు అని మధు తెలిపారు.
మధు తదుపరి సినిమా
ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించి, మోహన్ బాబు నిర్మించిన కన్నప్ప అనే తెలుగు సినిమాలో మధు నటిస్తున్నారు. హిందూ పురాణాల్లోని శివుని భక్తుడు కన్నప్ప కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో విష్ణు మంచు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
కన్నప్ప సినిమాలో మోహన్ బాబు, ఆర్. సరత్ కుమార్, అర్పిత్ రంకా, కౌశల్ మండా, రాహుల్ మాధవ్, దేవరాజ్, ముకేష్ రిషి, బ్రహ్మానందం నటిస్తున్నారు. అక్షయ్ కుమార్, ప్రభాస్, కాజల్ అగర్వాల్, మోహన్ లాల్ అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. కన్నప్ప జూన్ 27న థియేటర్లలో విడుదల కానుంది.