ప్రస్తుతం ప్రభాస్.. రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధే శ్యామ్’ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే బాహుబలి మూవీ రష్యాతో పాటు జపాన్ వంటి దేశాల్లో మంచి ఆదరణ పొందింది. 


హీరోగా ప్రభాస్ క్రేజ్ మన దేశంలోనే కాదు.. విదేశాల్లోనూ పీక్స్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రభాస్ సినిమాలను వాళ్ల సొంత సినిమాల్ల ఆదరిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో ‘బాహుబలి’ సినిమా చేసాడో హీరోగా ప్రభాస్ క్రేజ్ లోకల్ లెవల్ నుంచి గ్లోబల్ లెవల్‌కు పెరిగింది. అంతేకాదు బాహుబలితో బాలీవుడ్ హీరోలకు కూడా సాధ్యం కానీ రికార్డులను తన వశం చేసుకున్నాడు. ఆ తర్వాత ‘సాహో’ తో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసాడు.ఈ చిత్రం బ్యాడ్ టాక్‌తో కూడా కళ్లు చెదరే వసూళ్లను సాధించింది. ప్రస్తుతం ప్రభాస్.. రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధే శ్యామ్’ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే బాహుబలి మూవీ రష్యాతో పాటు జపాన్ వంటి దేశాల్లో మంచి ఆదరణ పొందింది. 

ఇక జపాన్ దేశంలో రజినీకాంత్ తర్వాత ఎన్టీఆర్‌కు కూడా అభిమానులున్నారు. తాజాగా జపాన్ ఫేవరేట్ హీరోల లిస్టులో ప్రభాస్ కూడా ఉండటం విషేషం. అక్కడ షాపుల్లో ప్రభాస్ బాహుబలి గెటప్ బొమ్మలతో పాటు సాహోలో అతని గెటప్‌కు సంబంధించిన ఫోటోలతో పాటు టాయ్స్, మరియు వస్తువులు దర్శనమిస్తున్నాయి. తాజాగా జపాన్‌కు చెందిన కూల్ డ్రింక్ బాటిల్స్ క్రేట్ చిత్రాలు నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి. ఆ సీసాల లేబుల్స్ పై ప్రభాస్ పిక్ ఉండడం విశేషం. వాస్తవానికి అవి జపాన్ IKEAలో విక్రయించబడుతున్న ఖాళీ గాజు సీసాలు. వాటికి ప్రభాస్‌ ‘రాధే శ్యామ్’ ట్రైలర్ లుక్ స్టిక్కర్‌ ఉండడం గమనార్హం. ఈ పనిని ప్రభాస్ నుండి అనుమతి తీసుకుని చేశారో లేదో తెలియదు. కానీ ప్రస్తుతం ఆన్‌లైన్‌లో మాత్రం ఆ పిక్స్ సంచలనం సృష్టిస్తున్నాయి.

రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే జంటగా నటించిన పాన్ ఇండియా చిత్రం "రాధేశ్యామ్" జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా విడుదలైన ట్రైలర్ ని బట్టి చూస్తే ఈ సినిమాలో కొన్ని ఆసక్తికర సన్నివేశాలు చూడబోతున్నట్లు తెలుస్తుంది. 1970 బ్యాక్ డ్రాప్ కథతో తెరకెక్కించిన "రాధేశ్యామ్" సినిమాలో అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ పాత్రను కూడా చూపించబోతున్నారు. 

Also read RRR movie: దానయ్యని కలిసిన డిస్ట్రిబ్యూటర్స్.. ఇలాగైతే కష్టమే, 50 నుంచి 70 కోట్ల లాస్ ?

చేతి రాతలను చూసి భవిష్యత్తు చెప్పే విక్రమాదిత్య పాత్రలో నటించిన ప్రభాస్ "రాధేశ్యామ్" చిత్రంలో ఇందిరాగాంధీ హస్తరేఖలను చూసి ఆమె భవిష్యత్తు గురించి కూడా చెప్పనున్నట్లు ట్రైలర్ లో అందుకు సంబంధించిన ఒక సన్నివేశాన్ని చూస్తే తెలుస్తుంది. ప్రపంచ దేశ నాయకులంతా కలవాలనుకునే గొప్ప హస్త సాముద్రిక నిపుణుడు.. పామ్ హిస్టరీలో ఐన్ స్టీన్ అయిన విక్రమాదిత్య 1970 సమయంలో ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ రాజకీయ భవిష్యత్తుతో పాటు వ్యక్తిగత జీవితం ఎలా ఉండబోతుందని చెప్పాడో తెలియాలంటే ఈ సినిమా విడుదల వరకు ఆగాల్సిందే.

Also read Mahesh Babu: దుబాయ్ లో మహేష్ బాబు ఫ్యామిలీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. ఫ్యామిలీతో జాయిన్ అయిన స్టార్ డైరెక్టర్