Asianet News TeluguAsianet News Telugu

RRR movie: దానయ్యని కలిసిన డిస్ట్రిబ్యూటర్స్.. ఇలాగైతే కష్టమే, 50 నుంచి 70 కోట్ల లాస్ ?

తెలుగు చిత్ర పరిశ్రమ ప్రస్తుతం తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. ఒక వైపు ఒమిక్రాన్ ముంచుకు వస్తుంటే, మరోవైపు ఏపీలో టికెట్స్ రేట్ల వ్యవహారం తేలేలా కనిపించడం లేదు.

RRR movie distributors meets DVV Danayya
Author
Hyderabad, First Published Dec 30, 2021, 9:44 PM IST

తెలుగు చిత్ర పరిశ్రమ ప్రస్తుతం తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. ఒక వైపు ఒమిక్రాన్ ముంచుకు వస్తుంటే, మరోవైపు ఏపీలో టికెట్స్ రేట్ల వ్యవహారం తేలేలా కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ చిత్రాలు ఎలా గట్టెక్కుతాయి అనే సందేహం సర్వత్రా నెలకొంది. 

తాజాగా ఆర్ఆర్ఆర్ నిర్మాతకు ఇబ్బందులు మొదలైనట్లు సమాచారం అందుతోంది. ఏపీలో కోస్టల్ ఆంధ్ర, సీడెడ్ ఏరియాలకు గాను ఆర్ఆర్ఆర్ చిత్రానికి 140 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. ఆమేరకు థియేట్రికల్ హక్కులు సొంతం చేసుకునేందుకు బయ్యర్లు నిర్మాత దానయ్యతో ఒప్పందం కుదుర్చుకున్నారు. 

ఒక్క వైజాగ్ ఏరియాకే 30 కోట్లకు థియేట్రికల్ హక్కులు సొంతం చేసుకున్నారు డిస్ట్రిబ్యూటర్. కానీ ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే అంత మొత్తం రికవరీ అవుతుందా అనేది అనుమానంగా మారింది. ఇటీవల విడుదలైన పుష్ప చిత్రం వైజాగ్ లో 8 కోట్ల వరకు వసూలు చేసింది. లాంగ్ రన్ లో మహా అయితే 15 కోట్ల వరకు రాబడుతుందేమో. ఇప్పుడిప్పుడే కోవిద్ కేసులు పెరుగుతున్నాయి. ఏపీ టికెట్ ధరలు కూడా అనుకూలంగా లేవు. ఇలాంటి పరిస్థితిల్లో ఆర్ఆర్ఆర్ చిత్రానికి ముందుగా కుదుర్చుకున్న డీల్ తో కొనడం కష్టమే అనేస్తున్నారు బయ్యర్లు. 

ఇటీవల దానయ్యని కలసిన ఏపీ డిస్ట్రిబ్యూటర్స్ పరిస్థితులు ఇలాగే కొనసాగితే కష్టం అని తేల్చేశారట. థియేట్రికల్ హక్కులని 50 శాతం వరకు తగ్గించాలని డిమాండ్ చేశారట. దానయ్య 30 శాతం తగ్గిస్తానని హామీ ఇచ్చారట. బయ్యర్లు కనీసం 40 శాతం అయినా తగ్గించాలని డిమాండ్ చేసే అవకాశం లేకపోలేదు. దీనితో ఏపీలో దానయ్య 50 నుంచి 70 కోట్ల వరకు నష్టపోక తప్పదేమో అని అంటున్నారు. ఇదే కనుక జరిగితే ఆర్ఆర్ఆర్ చిత్రానికి బిగ్ లాస్ అని చెప్పాలి. 

ఇక దేశ వ్యాప్తంగా కూడా కోవిడ్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. మహారాష్ట్ర, ఢిల్లీలో కోవిడ్ కేసుల్లో జంప్ అధికంగా ఉంది. జనవరి 7న ఆర్ఆర్ఆర్ చిత్రం రిలీజ్ కు రెడీ అవుతోంది. మరి అప్పటికి పరిస్థితులు ఎలా ఉంటాయో వేచి చూడాలి. 

Also Read: ఘాటు లిప్ కిస్సులతో రెచ్చిపోయిన శ్రీయ.. వీళ్ళ రొమాన్స్ కి హద్దే లేదా, ఫోటోస్ వైరల్!

Follow Us:
Download App:
  • android
  • ios