Asianet News TeluguAsianet News Telugu

`రాధేశ్యామ్‌` అసలు స్టోరీ పాయింట్ రివీల్‌ చేసిన లిరిక్‌ రైటర్.. ప్రభాస్‌ గురించి గూస్‌బంప్స్ తెప్పించే న్యూస్

`ఈ రాతలే` పాటలో సినిమా కథని చెప్పాలనుకునే ఇలా రాశామని, దర్శకుడి నిర్ణయం ప్రకారమే ఆ పాటని ప్రత్యేకంగా రాశామని తెలిపారు పాట రచయిత కృష్ణకాంత్‌. అయితే పాటలో చెప్పిన కథ కొంత శాతమే అని, అసలు కథ ఇంకా చాలా ఉందని చెప్పారు. 

prabhas now globle star saya writer krishna kanth radheshyam story revealed
Author
Hyderabad, First Published Nov 20, 2021, 5:33 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

`ప్రభాస్‌(Prabhas) పాన్‌ ఇండియా స్టార్ రేంజ్‌ దాటిపోయాడు. ఇప్పుడాయన గ్లోబల్ స్టార్‌(Prabhas Globle Star) అయిపోయాడు. ప్రభాస్‌కి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నార`ని అంటున్నారు పాటల రచయిత కృష్ణకాంత్‌. `రాధేశ్యామ్‌`(Radheshyam) చిత్రంలో ఇటీవల విడుదలైన `ఈ రాతలే.. ` పాట ఎంతగా ఆకట్టుకుంటుందో తెలిసిందే.  మిలియన్స్ వ్యూస్‌తో దూసుకుపోతున్నఈ పాటని కృష్ణకాంత్‌ రాశారు. పాటకి మంచి స్పందన లభిస్తున్న నేపథ్యంలో శనివారం ఆయన మీడియాతో ముచ్చటించారు. సినిమా కథ గురించి, ప్రభాస్‌ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. Radheshyam స్టోరీ పాయింట్ ని రివీల్‌ చేశారు. 

ఇటీవల విడుదలైన `ఈ రాతలే` పాట ఒక ప్రయోగాత్మకమైన సాంగ్‌ అని, పాటకి ఊహించిన విధంగా రెస్పాన్స్ వస్తోందని, మొదట లిరిక్‌ అర్థం కావడం లేదనే టాక్‌ వచ్చినా, వీడియో వచ్చాక అందరికి అర్థమయ్యిందన్నారు. ఇతర దేశాలకు చెందిన అభిమానులు కూడా తెలుగు లిరిక్‌ని ఆయా భాషల్లో అనువదించి సోషల్‌ మీడియాలో పోస్టులు చేస్తున్నారని, దీంతో ప్రభాస్‌కి ఉన్న ఫాలోయింగ్‌ ఏంటో అర్థమవుతుందన్నారు. ప్రభాస్‌ ఇప్పుడు పాన్‌ ఇండియా స్టార్‌ కాదని, ఆయన గ్లోబల్‌ స్టార్‌ అని తెలిపారు. పేర్లు పలకడానికి కూడా వీల్లేని దేశాల్లో కూడా ఆయనకు అభిమానులున్నారని ఫ్యాన్స్ కి గూస్‌బమ్స్ ఇచ్చే న్యూస్‌ చెప్పారు.

`ఈ రాతలే` పాటలో సినిమా కథని చెప్పాలనుకునే ఇలా రాశామని, దర్శకుడి నిర్ణయం ప్రకారమే ఆ పాటని ప్రత్యేకంగా రాశామని తెలిపారు. అయితే పాటలో చెప్పిన కథ కొంత శాతమే అని, అసలు కథ ఇంకా చాలా ఉందని చెప్పారు. అయితే విజువల్స్ మాత్రం సినిమాలోని అక్కడక్కడ అంశాలను తీసుకుని డిజైన్‌ చేశారని చెప్పారు. ఈ యానిమేషన్‌ విజువల్స్ స్పెషల్‌గా ఉండాలనే అనుకుని డిజైన్‌ చేసినట్టు చెప్పారు కృష్ణకాంత్‌. వాటికి మంచి స్పందన లభించిందన్నారు. కాకపోతే సినిమాలో ఈ పాటకు వచ్చే విజువల్స్ కి, ఇప్పుడు విడుదలైన పాటలోని విజువల్స్ కి సంబంధం లేదన్నారు. పూర్తి కొత్తగా ఉంటాయని, అవి మరింతగా కట్టిపడేస్తాయని తెలిపారు.

సినిమా కథ గురించి నానా రకాలుగా అనుకుంటున్నారని, పాటని బట్టి ఇది పునర్జన్మల కథ అని, లవ్‌ ఫెయిల్యూర్‌ అని, విషాద కథ అని, సైన్స్ ఫిక్షన్‌ అని, సైన్స్ కి, జాతకాలకు మధ్య సాగుతుందని రకరకాలుగా కథని ఊహించుకుంటున్నారు. అయితే ఆ సస్పెన్స్ మాత్రం అలానే ఉండాలని, తానేమి చెప్పలేనన్నారు. అదే సమయంలో ఈ కథ మాత్రం 1970లో యూరప్‌లో జరిగే ప్రేమ కథ అని స్పష్టం చేశారు. ప్రేమ అనేది తరతరాలుగా విఫలమవుతూనే ఉంటుంది. కానీ ఇందులో రాధాకృష్ణులు కలిశారా? తమ ప్రేమకి ముగింపు పలికారా? అనేది చూపించినట్టు చెప్పారు రైటర్ కృష్ణకాంత్‌. 

సినిమాలో పాటలన్నీ సందర్భానుసారంగా ఉంటాయని చెప్పారు. తాను ఐదు పాటలు రాసినట్టు తెలిపారు. `జిల్‌` సినిమా నుంచి ఈ చిత్ర దర్శకుడు రాధాకృష్ణతో ట్రావెల్‌ అవుతున్నట్టు తెలిపారు. `ప్రభాస్‌తో `సాహో` సినిమాకి పనిచేశా. ఆయనకు తాను డై హార్డ్ ఫ్యాన్ ని. దీంతో ప్రభాస్‌ సినిమా అంటే ప్రత్యేకంగా కేర్‌ తీసుకుని పాటలు రాస్తాన`ని చెప్పారు. `ఈ రాతలే` పాట విడుదల ఆలస్యంపై స్పందిస్తూ, తెలుగు టీమ్‌కి సంబంధించి మిస్టేక్ ఏం లేదని, అది హిందీలోనే లేట్‌ అయ్యిందన్నారు. తెలుగులో పాట, వీడియో రెడీగా ఉందని, కానీ ఇతర భాషల్లో రెడీ కాలేదన్నారు. అన్ని భాషల్లో పాట పూర్తి అవడానికి టైమ్‌ పట్టిందని, పైగా విడుదల కూడా ఇక్కడ టీమ్‌ పరిధిలో లేదని, టీ సిరీస్‌ చేతుల్లో ఉందని, వాళ్ల వద్దే ఆలస్యమైందని చెప్పారు. దీంతో ఫ్యాన్స్ బాగా నిరాశ చెందారని, కానీ పాట వచ్చాక వాళ్లు ఫుల్‌ ఖుషీ అని తెలిపారు. 

also read: Radheshyam: పాటలోనే కథ అంతా లీక్‌... `మగధీర`స్టోరీని దించేశారా? ప్రూఫ్స్‌ ఇవే..

Follow Us:
Download App:
  • android
  • ios