MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Radheshyam: పాటలోనే కథ అంతా లీక్‌... `మగధీర`స్టోరీని దించేశారా? ప్రూఫ్స్‌ ఇవే..

Radheshyam: పాటలోనే కథ అంతా లీక్‌... `మగధీర`స్టోరీని దించేశారా? ప్రూఫ్స్‌ ఇవే..

`ఈ రాతలే` పాటలోనే `రాధేశ్యామ్‌` కథ మొత్తం చెప్పినట్టుగా అనిపిస్తుంది. అంతేకాదు `మగధీర` చిత్రానికి, ఈ సినిమాకి సంబంధం ఉందనే సంకేతాలనిస్తున్నాయి. ఇంట్రెస్టింగ్‌ విషయాలను ఈ పాటలో కనిపిస్తున్నాయి. 

3 Min read
Author : Aithagoni Raju
| Updated : Nov 16 2021, 06:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

ప్రభాస్‌, పూజాహెగ్డే జంటగా నటించిన `రాధేశ్యామ్‌` చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్‌ `ఈ రాతలే.. ` సోమవారం విడుదలైంది. ఊరించి ఊరించి ఎట్టకేలకు పాటని నైట్ తొమ్మిది తర్వాత విడుదల చేశారు. ప్రస్తుతం పాట ప్రభాస్‌ అభిమానులతోపాటు సాధారణ ఆడియెన్స్ కి కూడా కనెక్ట్‌ అవుతుంది. వైరల్‌ అవుతుంది. అయితే ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు ఇందులో కనిపిస్తుండటం విశేషం. ఈ పాటలోనే `రాధేశ్యామ్‌` కథ మొత్తం చెప్పినట్టుగా అనిపిస్తుంది. అంతేకాదు `మగధీర` చిత్రానికి, ఈ సినిమాకి సంబంధం ఉందనే సంకేతాలనిస్తుంది. ఇంట్రెస్టింగ్‌ విషయాలు ఈ పాటలో కనిపిస్తున్నాయి. 

210

తాజాగా విడుదలైన `ఈ రాతలే` పాటలో సినిమా మొత్తం కథని చెప్పాడు దర్శకుడు రాధాకృష్ణ. ఇది పునర్జన్మల కథ అనే విషయం స్పష్టమవుతుంది. అంతేకాదు ఈ సినిమా సైన్స్ కి, ఆస్ట్రాలజీకి మధ్య కాన్ఫ్టిక్ట్ ని తెలియజేస్తుందనే విషయం అర్థమవుతుంది. అందులో భాగంగా పాటలో స్టెథస్కోప్‌ని, మిర్రర్‌లను చూపించారు.
 

310

అదే సమయంలో ట్రైన్‌ యాక్సిడెంట్‌ నుంచి వాళ్లు నేరుగా ఆకాశంలోకి వెళ్లిపోవడం, స్టెథస్కోప్‌, మిర్రర్‌లపై నుంచి  సముద్రంలోకి వెళతారు. అక్కడ అరచేతిని చూపించడం విశేషం. ఇదే విషయం సైన్స్, జాతకాలకు మధ్య జరిగే సంఘర్షణని తెలియజేస్తుంది. అది సినిమాలోని హీరోహీరోయిన్ల జీవితాలను ఎలా మలుపు తిప్పిందనేది ఆసక్తిగా ఉండబోతుందని అనిపిస్తుంది. 

410

ముఖ్యంగా సముద్రంలో అరచేతిని చూపించడం, అందులో నుంచి కారులో ప్రభాస్‌, పూజా హెగ్డే ప్రయాణించడం, తమ గత జ్ఞాపకాల్లోకి వెళ్లిపోవడం జరుగుతుందని తెలుస్తుంది. 

510

మరోవైపు సినిమాలో ప్రభాస్‌ పామిస్ట్ విక్రమాధిత్యగా కనిపించబోతున్నట్టు ఇటీవల విడుదల ఫస్ట్ గ్లింప్స్ లో తెలిపారు. ఇప్పుడు అదే విషయం పాటలోనూ స్పష్టం చేశారు. ట్రైన్‌ యాక్సిడెంట్‌ జరుగుతుందని ముందే గమనించిన ప్రభాస్‌, తన ప్రియురాలు(పూజా హెగ్డే)ని తీసుకెళ్లేందుకు కారులో వస్తాడు. ఆమెని రక్షించే ప్రయత్నం చేస్తాడు

610

దీంతోపాటు..ఈ సినిమాకి `మగధీర`కి సంబంధం ఉందని, ఇది పునర్జన్మల స్టోరీ అని.. ట్రైన్‌లో ప్రభాస్‌, పూజా హెగ్గే ఒకరినొకరు చేతులు పట్టుకునే సన్నివేశం స్పష్టం చేస్తుంది. అంతేకాదు లిరిక్‌ని బట్టి వాళ్లు గత జన్మలో కలవలేకపోయారని, ఈ జన్మలో కలుస్తారనే అర్థం `ఏదో జన్మ బాధే పోదే ప్రేమై.. రాదే.. ఈ రాతలే..`, `ఈ జన్మ రాతలై..దోబూచులే`..  అనే లిరిక్‌ ఉండటం విశేషం. గత జన్మలో విడిపోయిన వీరిద్దరు ప్రస్తుత జన్మలో కలవబోతున్నారనే విషయాన్ని తెలిపారు.
 

710

ఇప్పటికే పునర్జన్మల ఆధారంగా చాలా కథలు మనకు వచ్చాయి. ఆ వృత్తాంతంతో వచ్చిన అన్ని కథలు సక్సెస్ అవలేదు. ఏ కథ అయితే ప్రేక్షకుడిని తనతో పాటు ట్రావెల్ చేపించగలిగిందో... అది మాత్రమే సక్సెస్ అయింది. ఉదాహరణకు మగధీర సినిమా కూడా పునర్జన్మల వృత్తాంతం పీరియాడిక్ డ్రామా నే అయినా అందులోని వైవిఆధ్యం సినిమాను బ్లాక్ బస్టర్ గా మార్చింది. ఇక్కడ కూడా పీరియాడిక్ డ్రామా, పునర్జన్మల కథ ఉన్నాయి. ఇది ఎంత మేర ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందనేది ఈ సినిమా విజయావకాశాలవిజయావకాశాలను డిసైడ్ చేస్తుంది. 

810

ఒక్క పాటలోనే అనేక విషయాలను చర్చించడం, సినిమా స్టోరీని తెలియజేయడం పెద్ద సాహసమనే చెప్పాలి. `రాధేశ్యామ్‌` మేకర్స్ ఆ సాహసం చేశారు. విజువల్‌ వండర్‌గా ఈ సినిమాని తీర్చిదిద్దారనే విషయాన్ని కూడా ఈ పాటతోనే క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ కథని ఎంత ఆసక్తికరంగా, ఎంత ఎంగేజింగ్‌గా, ఎంతటి కొత్తదనంతో కూడా స్క్రీన్‌ప్లేతో, ఆడియెన్స్ ని ఎంగేజ్‌ చేసేలా ఎలా చెప్పబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. 
 

910

ఎందుకంటే `మగధీర` చిత్రంతో పీరియడ్‌ టైమ్‌ని, ప్రస్తుత కాలానికి పర్‌ఫెక్ట్ గా మ్యాచ్‌ చేశాడు రాజమౌళి. మరో అనుమానం లేకుండా జనాలకు ఈజీగా అర్థమయ్యేలా చెప్పి ఇండస్ట్రీ రికార్డ్ లను తిరగరాశాడు. మరి `రాధేశ్యామ్‌` దర్శకుడు రాధాకృష్ణ.. ఈ కథని ఎంత కన్విన్సింగ్‌గా చెప్పబోతున్నాడనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.  సినిమా ఎలా ఉండబోతుందనేది తెలియాలంటే మ జనవరి 14 వరకు ఆగాల్సిందే. 
 

1010

ప్రభాస్‌, పూజా హెగ్డే ఫస్ట్ టైమ్ జంటగా నటించిన ఈ చిత్రానికి రాధాకృష్ణ దర్శకత్వం వహించగా, యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్‌ పతాకాలపై యూవీ కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్‌, ప్రసీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్‌ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. 

related news: Radheshyam first song: అభిమానుల ఓపికని పరీక్షించిన ప్రభాస్‌ టీమ్‌.. ఎట్టకేలకు `రాధేశ్యామ్‌` ఫస్ట్ సింగిల్‌

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
విజయ్ దేవరకొండ, అల్లు శిరీష్ తరువాత పెళ్లి పీటలెక్కబోతున్న మరో టాలీవుడ్ హీరో
Recommended image2
గద్దర్ అవార్డులలో సత్తా చాటిన చిన్న సినిమాలు, లో బడ్జెట్ మూవీస్ కు దక్కిన గౌరవం..
Recommended image3
Dhurandhar 2 Trailer Review: ధురంధర్ 2 ట్రైలర్‌ రివ్యూ.. యాక్షన్‌తో రణ్‌వీర్ సింగ్ విధ్వంసం.. 5 పవర్‌ఫుల్ డైలాగ్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved