బాహుబలి సినిమాతో హీరో ప్రభాస్ కు ప్రపంచంలోని తెలుగువారిలో మాత్రమే కాక దేశవ్యాప్తంగా ఎంతటి క్రేజ్ ఎంతటి క్రేజ్ వచ్చిందో తెలిసిందే. మరి ప్రభాస్ కు అంతటి క్రేజ్ రావటంతో.. ఇప్పుడు ఆయన చుట్టు, ఆయన కుటుంబ సభ్యుల చుట్టు జరిగే ప్రతి విషయం ఇప్పుడు వార్తగా వైరల్ అవుతోంది.

 

ప్రభాస్ క్రేజీ హీరో అయినా సాధారణంగా ప్రభాస్ వాళ్ల అమ్మ మాత్రం ఎక్కువగా లైమ్‌ లైట్‌లోకి రావడానికి ఇష్టపడరు. మీడియాకు దూరంగా వుండే ప్రభాస్ తల్లి గురించిన ఒక వార్త మాత్రం ప్రస్తుతం మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అందుకు కారణం ఎవరో కాదు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన గరుడ వేగ సినిమా హీరోయిన్ పూజా కుమార్. ఈ బ్యూటీ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ ప్రభాస్ తల్లిని వార్తల్లోకి తీసుకొచ్చింది.

 

గరుడ వేగ సినిమా చూసిన ప్రభాస్ తల్లికి.. సినిమాలో పూజా పాత్ర, తాను నటించిన తీరు ఎంతో నచ్చాయట. తనని అభినందించినందుకు థాంక్స్ ఆంటీ అంటూ పూజా కుమార్ తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్టు పెట్టింది. పూజా కుమార్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో ఫుల్లుగా సర్కులేట్ అవుతోంది. అలా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తల్లి కూడా చాలా కాలం తర్వాత మీడియాలో మరోసారి బాగా పాపులర్ అవుతున్నారు.