ప్రభాస్ హీరోగా యువీ క్రియేషన్స్ బేనర్ పై తెరకెక్కుతున్న సాహో రన్ రాజా రన్ ఫేం సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న సాహో ప్రభాస్ తో ఆసక్తికరమైన డీల్ కుదుర్చుకున్న సాహో హీరోయిన్ శ్రద్ధ కపూర్

బాహుబలి చిత్రంతో తనకొచ్చిన స్టార్ డమ్ కు.. అసలు హిందీ భాష వచ్చి వుంటే.. ప్రభాస్ బాలీవుడ్ లోనే జెండా పాతింగే అనేవాడు. కానీ తెలుగు వాడైన ప్రభాస్ హిందీ భాష ప్రాబ్లెమ్ కావటంతో కాస్త బెరుకుగానే మీడియా సమావేశాల్లో మాట్లాడుతూ మేనేజ్ చేసేశాడు. కానీ బాహుబలి 2 ఇచ్చిన సక్సెస్ ప్రభాస్ వద్దన్నా బాలీవుడ్, తెలుగు సహా అన్ని సినిమా పరిశ్రమల మీడియాలు తనగురించి, తన సినిమాల గురించి రాసేస్తూనే వున్నాయి. ఇక ప్రభాస్ తాజా చిత్రంలో బాలీవుడ్ నుంచి లేత ఆషిఖి2 భామ శ్రద్ధా కపూర్ ను డంప్ చేయటంతో ప్రభాస్ పై మీడియా కాన్ సెంట్రేషన్ ఎక్కువైపోయింది. పైగా హిందీలోనూ తదుపరి చిత్రం సాహో రిలీజ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ప్రమోషన్స్ లో అక్కడి మీడియాతో ఇంటరాక్ట్ కావాల్సి వుంటుంది. అందుకే.. హిందీ రాని ప్రభాస్, తెలుగు రాని శ్రద్ధాకపూర్‌ ఓ వెరైటీ డీల్ కుదుర్చుకున్నారట.



తాజాగా సెట్స్‌ మీద ఉన్న ‘సాహో’లో ప్రభాస్‌ సరసన ఈ శ్రద్ధా కథానాయికగా కమిట్‌ అయిన విషయం తెలిసిందే. సుజిత్‌ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌లు ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం దర్శకుడు సుజిత్‌ చాలా మంది యాక్టర్లు, టెక్నీషియన్లతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రభాస్‌ మాత్రం శ్రద్ధాకపూర్‌తో ఓ డీల్‌ సెట్‌ చేసుకున్నారట. ‘

సాహో’ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోన్న సంగతి తెలిసిందే.ప్రభాస్‌కు హిందీ అంతగా రాదు. శ్రద్ధాకపూర్‌కు తెలుగు తెలీదు. సో...సెట్‌లో లాంగ్వేజ్‌ ప్రాబ్లమ్‌ రాకుండా ప్రభాస్‌కు శ్రద్ధా హిందీ నేర్పిస్తే, శ్రద్ధాకు ప్రభాస్‌ తెలుగు నేర్పించేలా ఇద్దరూ డీల్‌ చేసుకున్నారట. అయితే తెలుగు వెర్షన్‌ ‘సాహో’లో శ్రద్ధాకు డబ్బింగ్‌ వేరే వారు చెబుతారు. అలాగే హిందీ వెర్షన్‌లో ప్రభాస్‌కు వేరే వారు డబ్బింగ్‌ చెబుతారు.