ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీపై క్లారిటీ.. సాహో తర్వాత అదే...

prabhas gives clarity on his bollywood entry
Highlights

  • బాహుబలితో నేషనల్ స్టార్ గా మారిపోయిన ప్రభాస్
  • బాహుబలి చిత్రం తర్వాత జాతీయ స్థాయిలో యమా క్రేజ్
  • ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీపై తాజాగా క్లారిటీ

బాహుబలి తర్వాత.. ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ గురించి జోరుగానే ప్రచారం జరిగింది. బాహుబలితో దేశ వ్యాప్త గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ బాలీవుడ్ లోకి ఎప్పుడు ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే అంశంపై బాగానే చర్చ జరిగింది. అనేక ఊహాగానాలు వినిపించాయి. అలాగే ఈ హీరో తదుపరి సినిమా ‘సాహో’ హిందీలో కూడా భారీ ఎత్తున విడుదల కాబోతోంది. అయితే సాహోతో కూడా డబ్బింగ్ ద్వారా మాత్రమే ప్రభాస్ పలకరించబోతున్నాడు.అయితే డైరెక్ట్ ఎంట్రీ ఎప్పుడనేది మాత్రం ఇన్నాళ్లు క్లారిటీ లేదు. కానీ.. తాజాగా ఒక మ్యాగజైన్ కవర్ పేజీ కోసం పోజులిచ్చిన ప్రభాస్.. అదే మ్యాగజైన్ కు ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు. అందులో.. బాలీవుడ్ ఎంట్రీ గురించి చెప్పాడు ఈ హీరో.
 

ఒక లవ్ స్టోరీ ద్వారా హిందీ ప్రేక్షకులను డైరెక్టుగా పలకరించబోతున్నాడట ఈ తెలుగు నటుడు. అది ధర్మా ప్రొడక్షన్స్ పతాకంపై కరణ్ జొహార్ నిర్మించే సినిమా అని ప్రభాస్ తెలిపాడు. ఆ సినిమా స్క్రిప్ట్ ను తను ఇప్పటికే విన్నాను అని.. దాంతో బాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వబోవడం ఖాయమేనని ప్రభాస్ చెప్పాడు. ప్రస్తుతానికి ఈ ఖబర్ అందుతోంది. మరిన్ని వివరాలు.. త్వరలోనే ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

loader