Asianet News TeluguAsianet News Telugu

'రాధే శ్యామ్': అలా అయితే నిర్మాత‌ల‌పై కంప్లైంట్ ఇవ్వండంటూ పోలీస్

 యూవీ క్రియేష‌న్స్ నిర్మాతలు వంశీ, ప్ర‌మోద్ మా ఎమోష‌న్స్ తో ఆడుకుంటున్నారు అంటూ ఓ నెటిజ‌న్స్ హైద‌రాబాద్ పోలీసుల‌కి ట్యాగ్ చేశారు. దీనికి సంబంధించిన హైద‌రాబాద్ పోలీస్ రిటెన్ కంప్లైంట్ లోక‌ల్ పీఎస్‌లో ఇవ్వండంటూ స్పందించింది. ఈ ట్వీట్ వైర‌ల్‌గా మారింది. 

Prabhas fans fires on UV Banner and producer Vamsi and Pramod
Author
Hyderabad, First Published Nov 17, 2021, 10:51 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

గత కొద్దిరోజులుగా ఫ్యాన్స్ సరైన అప్డేట్స్ ఇవ్వకుండా  యూవీ క్రియేషన్స్ అభిమానుల‌కి చుక్క‌లు చూపిస్తున్న సంగతి తెలిసిందే. రాధే శ్యామ్ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ ప్రొడ్యూసర్స్ మొద‌టి నుండి అభిమానుల ఆగ్ర‌హానికి గుర‌వుతున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ యూవీ క్రియేషన్స్‌ను బద్ద శత్రువులా చూసే స్దితికి చేరుకుంది.  అందుకు ఫ్యాన్స్ చెప్పే కారణం.. రాధే శ్యామ్‌ను సినిమాను సరిగ్గా ప్రమోట్ చేయడం లేదు, అప్డేట్లు ఇవ్వడం లేదు.. అంటూ నానా రకాలు తిట్టిపోస్తున్నారు.   సాయంత్రం ఐదు గంటలకు ఈ రాతలే అనే పాటకు సంబంధించిన లిరికల్ వీడియోను విడుదల చేస్తాను అని చెప్పారు. కానీ ఆలస్యం చేశారు. పైగా రెండు గంటలు సేపు అలానే వెయిట్ చేయించారు. టైం ఐదు దాటినా ఆరు దాటినా కూడా ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. ఎనిమిది గంట‌ల‌కు వ‌స్తుంద‌ని అన్నారు. అయిన రాలేదు.

దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ రాధేశ్యామ్ మేకర్స్ పై ఆగ్రహం వ్యక్తం చేసారు. నిర్మాణ సంస్థతోపాటు.. దర్శకుడిని సైతం బండ బూతులు తిడుతున్నారు. నిద్రపోతున్నావా ?.. కారణం చెప్పు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి అప్డేట్ ఇస్తామంటూ డార్లింగ్ అభిమానులకు ఆశ చూపిన యూవీ క్రియేషన్స్.. చివరి నిమిషంలో వాళ్ల ఆశలపై నీళ్లు జల్లింది . మరొక  అభిమాని యూవీ క్రియేష‌న్స్ నిర్మాతలు వంశీ, ప్ర‌మోద్ మా ఎమోష‌న్స్ తో ఆడుకుంటున్నారు అంటూ ఓ నెటిజ‌న్స్ హైద‌రాబాద్ పోలీసుల‌కి ట్యాగ్ చేశారు. దీనికి సంబంధించిన హైద‌రాబాద్ పోలీస్ రిటెన్ కంప్లైంట్ లోక‌ల్ పీఎస్‌లో ఇవ్వండంటూ స్పందించింది. ఈ ట్వీట్ వైర‌ల్‌గా మారింది. ఇప్పుడు మిగతా హీరోల ఫ్యాన్స్ కూడా తమకు ఏ మాత్రం ఇబ్బందిగా అనిపించినా ఇలా పోలీస్ లను ట్యాగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 

గతంలోనూ  ప్రభాస్ ఫ్యాన్స్  తమ హీరో దర్శకుడు రాధకృష్ణ కుమార్ ని వెతికి పెట్టమని కంప్లైంట్ చేసారు.ప్రభాస్ తో రాధేశ్యామ్ సినిమా చేస్తున్న దర్శకుడు రాధాకృష్ణ కుమార్ పట్టుకోమని రిక్వెస్ట్ చేస్తూ సిటీ పోలీస్ లకు రిప్లై ఇచ్చాడు. ఈ రిప్లై ట్వీట్ ని మంచు మనోజ్ రీట్వీట్ చేయటంతో వైరల్ అయ్యింది. ట్విట్టర్ లో ఫ్యాన్స్ యుద్దాలే కాదు..ఇలా ఫన్ కూడా ఓ రేంజిలో జరుగుతోందని అందరూ  ఖుషీ అవుతున్నారు.

Also read Radheshyam: పాటలోనే కథ అంతా లీక్‌... `మగధీర`స్టోరీని దించేశారా? ప్రూఫ్స్‌ ఇవే..

రాధేశ్యామ్ సినిమాను యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించగా.. ఇప్పటికే ఈ సినిమా నుంటి విడుదలైన పోస్టర్స్, టీజర్ యూట్యూబ్‏లో నయా రికార్డ్స్ సృష్టించాయి. ప్రభాస్‌, పూజా హెగ్డే ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న చిత్రం ‘రాధేశ్యామ్‌’.  భారీ బడ్జెట్‌తో ‘రాధేశ్యామ్‌’పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోంది. సినిమాను అధికభాగం ఇటలీలోనే చిత్రీకరించారు.

Also read Radheshyam first song: అభిమానుల ఓపికని పరీక్షించిన ప్రభాస్‌ టీమ్‌.. ఎట్టకేలకు `రాధేశ్యామ్‌` ఫస్ట్ సింగిల్‌

నటీనటులు: ప్రభాస్, పూజా హెగ్డే, స‌త్య‌రాజ్‌, భాగ్య‌శ్రీ, కునాల్ రాయ్ క‌పూర్‌, జ‌గ‌ప‌తిబాబు, జ‌య‌రాం, స‌చిన్ ఖేడ్‌క‌ర్‌, భీనా బెన‌ర్జి, ముర‌ళి శ‌ర్మ‌, శాషా ఛ‌త్రి, ప్రియ‌ద‌ర్శి, రిద్దికుమార్‌, స‌త్యాన్ త‌దిత‌రులు సాంకేతిక నిపుణులు: సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస ఎడిటర్ : కొటగిరి వెంక‌టేశ్వ‌రావు యాక్ష‌న్‌, స్టంట్స్‌ : నిక్ ప‌వ‌ల్, సౌండ్ డిజైన్ : ర‌సూల్ పూకుట్టి కొరియోగ్ర‌ఫి : వైభ‌వి మ‌ర్చంట్‌ కాస్ట్యూమ్స్ డిజైన‌ర్‌ : తోట విజ‌య భాస్క‌ర్ అండ్ ఎకా ల‌ఖాని వి ఎఫ్ ఎక్స్ సూప‌ర్‌వైజ‌ర్‌ : క‌మ‌ల్ క‌న్న‌న్‌ ఎక్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌ : ఎన్‌.సందీప్‌, హెయిర్‌స్టైల్‌‌ : రోహ‌న్ జ‌గ్ట‌ప్‌ మేక‌ప్‌ : త‌ర‌న్నుమ్ ఖాన్ స్టిల్స్‌ : సుద‌ర్శ‌న్ బాలాజి ప‌బ్లిసిటి డిజైన‌ర్‌ : క‌బిలాన్‌ పి ఆర్ ఓ : ఏలూరు శ్రీను కాస్టింగ్ డైర‌క్ట‌ర్‌ : ఆడోర్ ముఖ‌ర్జి ప్రోడక్షన్ డిజైనర్ : ర‌‌వీంద‌ర్‌ చిత్ర స‌మ‌ర్ప‌కులు : "రెబ‌ల్‌స్టార్" డాక్ట‌ర్ యు వి కృష్ణంరాజు నిర్మాతలు: వంశీ, ప్ర‌మోద్, ప్ర‌శీదా దర్శకుడు : రాధాకృష్ణ కుమార్.
 

Follow Us:
Download App:
  • android
  • ios