Radheshyam first song: అభిమానుల ఓపికని పరీక్షించిన ప్రభాస్ టీమ్.. ఎట్టకేలకు `రాధేశ్యామ్` ఫస్ట్ సింగిల్
`రాధేశ్యామ్‌ఫస్ట్ సాంగ్` అనే యాష్ ట్యాగ్‌ని ట్విట్టర్‌లో ట్రెండ్ చేశారు అభిమానులు. దీంతో ఎట్టకులకు స్పందించిన యూనిట్.. `టెక్నీకల్ కారణాలతో ఆలస్యమవుతుంది. 8గంటల వరకు వేచి ఉండాల`ని తెలిపారు.
ప్రభాస్(Prabhas).. తన అభిమానుల సహనాన్ని పరీక్షించారు. తాను నటిస్తున్న `రాధేశ్యామ్`(Radheshyam) ఫస్ట్ సింగిల్‌కి సంబంధించి ఊరిస్తూ ఊరిస్తూ ఎట్టకేలకు తొమ్మిది గంటల తర్వాత యూట్యూబ్‌లో విడుదల చేశారు. నిజానికి ఈ పాటని ఈ రోజు(సోమవారం) సాయంత్రం ఐదు గంటలకు విడుదల చేయబోతున్నట్టు గత మూడు రోజుల క్రితమే ప్రకటించారు యూనిట్. Radheshyam అప్‌డేట్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఓ అభిమాని లెటర్ రాసిన నేపథ్యంలో ఎట్టకేలకు సంబంధించి ఫస్ట్ సింగిల్‌ని విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ రోజు మార్నింగ్ పాట ప్రోమోని కూడా విడుదల చేశారు. దీంతో సాయంత్రం ఐదు గంటల కోసం ఇండియా వైడ్‌గా ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ రెండు కళ్లతో వెచి చూస్తూ వచ్చారు. ఐదు గంటలయ్యింది. కానీ ఇంకా సాంగ్ రిలీజ్ కాలేదు.
దీంతో `రాధేశ్యామ్‌ఫస్ట్ సాంగ్` అనే యాష్ ట్యాగ్‌ని ట్విట్టర్‌లో ట్రెండ్ చేశారు అభిమానులు. దీంతో ఎట్టకులకు స్పందించిన యూనిట్.. `టెక్నీకల్ కారణాలతో ఆలస్యమవుతుంది. 8గంటల వరకు వేచి ఉండాల`ని తెలిపారు. దీంతో మరింత ఓపిక చేసుకుని వెయిట్ చేశారు Prabhas ఫ్యాన్స్తోపాటు నెటిజన్లు, సినీ ప్రియులు. 8గంటలయ్యింది. కానీ నో అప్‌డేట్. నో సాంగ్. దీంతో మళ్లీ నిరాశే ఎదురయ్యింది. అసలు ఈ రోజు పాట వస్తుందా? విడుదల చేస్తారా? లేదా? అనే అనుమానాలు ఊపందుకున్నాయి. విమర్శలు తీవ్రమయ్యాయి. సహనం కోల్పోతున్నారు అభిమానులు. ఈ క్రమంలో ఎట్టకేలకు ఫస్ట్ సాంగ్ వచ్చింది. రాత్రి తొమ్మిది గంటల తర్వాత డైరెక్ట్ గా యూట్యూబ్‌లో విడుదల చేశారు.
`రాధేశ్యామ్` నుంచి ఫస్ట్ సింగిల్ `ఈ రాతలే` పాటని విడుదల చేశారు. యానిమేటెడ్‌తో సాగే ఈ పాట విజువల్‌గా ఆకట్టుకున్నా.. అభిమానులను సంతృప్తి పర్చలేకపోయింది. ఈ పాటలో తమ అభిమాన నటుడిని చూడాలనుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ కి నిరాశే ఎదురయ్యింది. యానిమేషన్‌లో పాటని విడుదల చేయడం మరింతగా అసంతృప్తికి గురవుతున్నారట అభిమానులు. అయితే ఇందులో విజువల్స్ కి మాత్రం ఫిదా అవుతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఇక `ఈ రాతలే` అంటూ సాగే ఈ పాట ఇప్పుడు శ్రోతలను మెప్పిస్తుంది. కానీ ఆశించిన స్థాయిలో లేదనే టాక్ కూడా వినిపిస్తుంది. జస్టిన్ ప్రభాకర్ సంగీతం అందించిన ఈ పాటని క్రిష్ణకాంత్ రాయగా, యువన్ శంకర్ రాజా, హరిని ఇవటూరి పాటని ఆలపించారు.
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన `రాధేశ్యామ్` చిత్రానికి `జిల్` ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ పతాకాలపై యూవీ కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్,ప్రసీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా ఇది రూపొందుతుంది. సంక్రాంతి కానుకగా జనవరి 14న సినిమాని విడుదల చేయబోతున్నారు. పీరియాడికల్ లవ్ స్టోరీగా సినిమా రూపొందుతుంది.
also read: Drushyam 2 Trailer: సినిమా తీసేలోపు వెంకీకి సినిమా చూపిస్తామంటున్న పోలీసులు