బాహుబలి తర్వాత ప్రభాస్ క్రేజ్ ప్రపంచవ్యాప్తమైపోయింది. దీంతో ప్రభాస్ సినిమాలపై క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. బాహుబలి తర్వాత సాహో సినిమా చేస్తున్నాడీ మిస్టర్ పర్ ఫెక్ట్. అది కూడా కంప్లీట్ అయిపోతోంది. అయితే సాహో తర్వాత సినిమా ఏమై ఉంటుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అయితే బాహుబలి తర్వాత ఇంతవరకూ ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకపోవడంతో ప్రభాస్ బ్యాడ్ టైం నడుస్తోందనే టాక్ వినిపిస్తోంది.

 

 

బాహుబలితో ఆకాశానికెక్కిన ఇమేజ్ ను కాపాడుకునేందుకు ప్రభాస్ పడరాని పాట్లు పడుతున్నాడు. బాహుబలి అంత కాకపోయినా భారీ బడ్జెట్ తో సాహో సినిమాలో నటిస్తున్నాడు. దీని తర్వాత ఎలాంటి ప్రాజెక్ట్ తో ముందుకొస్తాడోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సాహో సినిమా ఇంకొంచెం మిగిలి ఉండగానే మరో ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించేందుకు ప్రభాస్ ట్రై చేస్తున్నాడు.

 

వాస్తవానికి ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న సాహో సినిమా బాహుబలి 2 కంటే ముందే స్టార్ట్ చేశాడు. బాహుబలి కంక్లూజన్ సమయంలోనే టీజర్ రిలీజ్ చేయడంతో ఇక ప్రభాస్ నుంచి సినిమాలు జోరందుకుంటాయని అందరూ భావించారు. అయితే బాహుబలి తర్వాత సాహోనే ఇంకా రిలీజ్ చేయలేకపోయాడు. గ్రాఫిక్స్ వర్క్ కారణంగా ఇది కూడా లేటయ్యే అవకాశం కనిపిస్తోంది. అందుకో మరో సినిమాను పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యాడు ప్రభాస్.

 

 

జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమాను పట్టాలపైకి తీసుకెళ్తున్నాడు ప్రభాస్. ఈ సినిమాల ప్రభాస్ సరకన పూజెహెగ్డే నటించబోతున్నట్టు సమాచారం. లవ్ స్టోరీ ఎంటర్ టైనర్ కావడంతో దీన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలనుకుంటున్నారట. అన్నీ అనుకున్నట్టు జరిగితే జులైలో దీన్ని ప్రారంభించాలనుకుంటున్నాడు ప్రభాస్. బాహుబలి తర్వాత సాహో త్వరగా రిలీజవుతుంటే ఇప్పుడు అది కూడా లేటవుతోంది.. దీంతో మరో ప్రాజెక్టును పట్టాలెక్కించబోతున్నాడు ప్రభాస్. మరి చూద్దాం.. ఇది ఎంతవరకూ వర్కవుట్ అవుతుందో..!