Asianet News TeluguAsianet News Telugu

`మంచి రోజులు వచ్చాయ్‌` చిత్రం కోసం నిలబడ్డ ప్రభాస్‌, అల్లు అర్జున్.. కారణం ఇదేనా?

`మంచి రోజులు వచ్చాయి` కోసం పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్, అలాగే ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ సపోర్ట్ చేయడం విశేషం. ఈ చిత్రం దీపావళి కానుకగా రేపు(గురువారం-నవంబర్‌ 4)న విడుదల కానుంది. 

prabhas and allu arjun best wishes to manchi rojulochaie movie
Author
Hyderabad, First Published Nov 3, 2021, 7:20 PM IST

`ఏక్‌ మినీ కథ` చిత్రంతో పాపులర్‌ అయ్యాడు సంతోష్‌ శోభన్(Santhosh Shobhan). తాజాగా ఆయన మెహరీన్‌తో కలిసి `మంచి రోజులు వచ్చాయ్‌`(Manchi Rojulochaie) చిత్రంలో నటించాడు. మారుతి దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. యూవీ కాన్సెప్ట్స్, మాస్‌ మూవీ మేకర్స్, వి సెల్యులాయిడ్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ఇప్పుడు వార్తల్లో నిలుస్తుంది. సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అవుతుంది. కారణం ఈ సినిమా కోసం పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్(Prabhas), అలాగే ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్(Allu Arjun) సపోర్ట్ చేయడం. 

ఈ చిత్రం దీపావళి కానుకగా రేపు(గురువారం-నవంబర్‌ 4)న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందానికి Prabhas, Allu Arjun బెస్ట్ విషెస్‌ తెలిపారు. `మంచి రోజులు వచ్చాయి` సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాం. దర్శకుడు మారుతి, నిర్మాతలు, నటీనటులకు అల్‌ ది బెస్ట్` అని చెప్పారు. అటు ప్రభాస్‌, ఇటు బన్నీ అభినందనలు తెలియజేయడం విశేషం. అయితే వాళ్లు విషెస్‌ చెప్పడం వెనకాల ఓ కారణంగా ఉంది. ఈ చిత్ర దర్శకుడు మారుతి బన్నీకి ఫ్రెండ్‌. నిర్మాత ఎస్‌కేఎన్‌.. బన్నీ పీఆర్‌ టీమ్‌లో ముఖ్యుడు. తన ప్రమోషన్స్ ని తనే చూసుకుంటాడు. బన్నీ ఫ్యామిలీలో ఒకరిలా ఉన్నారు. వారి కోసం బన్నీ విషెస్‌ తెలియజేశారు. 

మరోవైపు ప్రభాస్‌తో హీరో సంతోష్‌ శోభన్‌ తండ్రి శోభన్‌ `వర్షం` సినిమా తీశారు. దీంతో సంతోష్‌ హీరోగా కెరీర్‌ ప్రారంభం నుంచి ప్రభాస్‌ సపోర్ట్ చేస్తూ వస్తున్నాడు. అలా ఇప్పుడీ చిత్రానికి తన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ఈ సినిమాకి ప్రభాస్‌ ఫ్యాన్స్ స్పెషల్‌ ప్రీమియర్స్ వేయించుకోవడం విశేషం. దీనిపై యూనిట్‌ స్పందిస్తూ, `సినిమా స్పెషల్ ప్రీమియర్స్ సంచలనం రేపుతున్నాయి. అన్నిచోట్ల హౌజ్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. ప్రీమియర్స్ టికెట్స్ అన్నీ హాట్ కేకుల్లా అమ్ముడైపోవడం గమనార్హం. వైజాగ్, ఏలూరు, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, తిరుపతి, నెల్లూరు తదితర నగరాల్లో నవంబర్ 3 రాత్రి పేయిడ్ ప్రీమియర్స్ ఏర్పాటు చేశారు. ప్రభాస్ ఫ్యాన్స్ డిమాండ్‌పై భీమవరంలో కూడా షో వేస్తున్నారు. ఈ స్పెషల్ ప్రీమియర్ బుకింగ్ ఓపెన్ అయిన వెంటనే టికెట్స్ అన్నీ సూపర్ ఫాస్టుగా అయిపోయాయి.

మిగిలిన చోట్ల కూడా ప్రీమియర్స్‌కు హౌజ్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. హైదరాబాద్, కడపలో కూడా ఎక్స్ ట్రా షోలు వేస్తున్నారు. మొత్తం 15 చోట్ల ఈ ప్రీమియర్స్ ఏర్పాటు చేస్తున్నారు. అన్నింటికి హౌజ్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. హైదరాబాద్ ఐమాక్స్ థియేటర్‌లో స్క్రీన్స్ పెంచే అవకాశం కూడా కనిపిస్తోంది. కేవలం ప్రీమియర్స్‌తోనే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. సందేశం, వినోదం కలిపి ఇవ్వడంలో దర్శకుడు మారుతి ఆరితేరిపోయారు. ఈ సినిమాను వి సెల్యులాయిడ్ SKN నిర్మిస్తున్నారు.  ఇప్పటి వరకు విడుదలైన కంటెంట్‌కి సూపర్ రెస్పాన్స్ రావడంతో పాటు ప్రీమియర్స్ అన్నీ హౌజ్ ఫుల్ అవుతుండటం శుభ పరిణామం` అని తెలిపింది.

also read: కేక పెట్టిస్తున్న అనుపమ హాట్ లుక్.. అలా చూస్తూ ఉండిపోతారు

Follow Us:
Download App:
  • android
  • ios