Asianet News TeluguAsianet News Telugu

ప్రభాస్ కు తలనొప్పిగా మారిన హిందీ క్లాసులు

  • బాహుబలితో వచ్చిన క్రేజ్ తో నేషనల్ స్టార్ గా మారిన ప్రభాస్
  • ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సాహో హిందీలోనూ రిలీజ్ కు ప్లాన్
  • హిందీ రాకపోవటంతో తాజాగా హిందీ నేర్చుకుంటున్న యంగ్ రెబెల్ స్టార్
prabhaa saaho hindi bollywood language problem teacher classes

‘బాహుబలి’ సక్సెస్ తో దేశవ్యాప్తంగా క్రేజ్ వున్న సెలెబ్రెటీగా మారిపోయిన ప్రభాస్ ‘బాహుబలి’ లో భారీ డైలాగ్స్ చెప్పి అదరగొట్టాడు. అయితే అటువంటి ప్రభాస్ కు ప్రస్తుతం అతను నేర్చుకుంటున్న హిందీ క్లాస్ లు చుక్కలు చూపెడుతున్నాయి అంటూ ఫిలింనగర్ లో గాసిప్పుల హడావిడి చేస్తున్నాయి. ‘బాహుబలి’ మూవీని బాలీవుడ్ లో ప్రమోట్ చేస్తున్నప్పుడు అక్కడ జరిగిన మీడియా సమావేశాల్లో ప్రభాస్ హిందీలో మాట్లాడవలసిన పరిస్థితి ఏర్పడింది. 

 

అయితే బాలీవుడ్ మీడియాతో ప్రభాస్ హిందీలో మాట్లాడే విషయంలో హిందీ భాషకు సంబంధించి కొన్ని సమస్యలు ఎదుర్కున్నాడు అన్న కామెంట్స్ ఉన్నాయి. దీనితో తన లేటెస్ట్ మూవీ ‘సాహో’ ను కూడ బాలీవుడ్ లో భారీ ఎత్తున విడుదల చేయడానికి ప్రభాస్ ఆలోచిస్తున్న నేపధ్యంలో ‘బాహుబలి’ మీడియా మీట్ లో జరిగిన పొరపాట్లను మళ్ళీ రిపీట్ చేయకుండా హిందీ భాష పై పట్టు సాధించడానికి ఒక ప్రత్యేకమైన ట్యూటర్ ను ప్రభాస్ పెట్టుకున్నట్లు టాక్. 

 

ప్రస్తుతం  ప్రభాస్ తన ‘సాహో’ షూటింగ్ పనులలో అదేవిధంగా అతడి వ్యక్తిగత పనులలో బిజీగా ఉండటంతో ఆహిందీ ట్యూషన్ అనుకున్న వేగంగా జరగక పోవడంతో ప్రభాస్ కు ఇప్పటికీ హిందీ పై పట్టురాలేదు అన్న గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. దీనికితోడు అన్నీ కుదిరితే ‘సాహో’ సినిమాకు హిందీలో తానే తనసొంత గొంతుతో డబ్బింగ్ చెప్పుకోవాలి అని భావిస్తున్న నేపధ్యంలో ఇప్పటికీ ప్రభాస్ కు హిందీ పై పట్టు దొరకక పోవడం ఒకసమస్యగా మారింది అనిఅంటున్నారు. ‘బాహుబలి’ కోసం రోజుకు 18 గంటల వరకు రకరకాల రిస్కీ ఫైట్స్ చేసిన ప్రభాస్ కు అతి సులువైన హిందీ భాష పై పట్టుదోరకకపోవడం ఆశ్చర్యకరం. అయితే ఎలాగైనా సరే హిందీ సంగతేందో చూడాలని ప్రభాస్ కుస్తీ పడుతున్నాడట.

Follow Us:
Download App:
  • android
  • ios