MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Chiranjeevi: సందీప్ రెడ్డికే గూస్ బంప్స్ తెప్పించిన చిరంజీవి సీన్ గురించి తెలుసా.. కోటని గుర్తుపట్టలేం

Chiranjeevi: సందీప్ రెడ్డికే గూస్ బంప్స్ తెప్పించిన చిరంజీవి సీన్ గురించి తెలుసా.. కోటని గుర్తుపట్టలేం

చిరంజీవి నటించిన సూపర్ హిట్ సినిమాలు కొన్ని సన్నివేశాలని అభిమానులు రిపీటెడ్ గా చూస్తూ ఉంటారు. అలా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కూడా చిరంజీవి నటించిన ఓ సన్నివేశాన్ని రిపీటెడ్ గా చూస్తూ ఉంటారట.

2 Min read
Author : Tirumala Dornala
Published : Oct 18 2026, 04:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Chiranjeevi
Image Credit : Asianet News

Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించారు. చిరంజీవి మాస్ హీరోగా ప్రేక్షకులని ఉర్రూతలూగించారు. చిరంజీవి మాస్ రారాజుగా వెలుగొందుతున్న రోజుల్లో చేసిన మూవీ ఖైదీ నెంబర్ 786. విజయ బాపినీడు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 1988లో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కోట శ్రీనివాసరావుని గుర్తు పట్టలేం
Image Credit : Asianet News

కోట శ్రీనివాసరావుని గుర్తు పట్టలేం

ఈ మూవీలో హీరోయిన్ గా భానుప్రియ నటించారు. కోట శ్రీనివాస రావు చిరంజీవికి విలన్ గా నటించడం ఇదే తొలిసారి. విలన్ గా, హీరోయిన్ తండ్రిగా ఆయన పాత్ర ఉంటుంది. ఈ మూవీలో కోట విభిన్నమైన గడ్డం గెటప్ లో ఉండడంతో ఆయన్ని గుర్తు పట్టడం కూడా కష్టమే. ఇక కైకాల సత్యనారాయణ, మోహన్ బాబు, నూతన్ ప్రసాద్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీలో భానుప్రియ, చిరంజీవి మధ్య వచ్చే గువ్వా గోరింకతో అనే సాంగ్ బెస్ట్ సాంగ్స్ లో ఒకటిగా నిలిచింది.

35
సందీప్ రెడ్డి కామెంట్స్
Image Credit : Asianet News

సందీప్ రెడ్డి కామెంట్స్

ఈ మూవీలో ఓ కీలక సన్నివేశం యానిమల్ మూవీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకి విపరీతమైన ఇష్టం అట. ఓ ఇంటర్వ్యూలో ఆ విషయం చెప్పారు. ఆ సీన్ మరేదో కాదు ఖైదీ నెంబర్ 786లో హీరోయిన్ భానుప్రియ ఊరందరి ముందు పంచాయతీలో చిరంజీవిని కొరడాతో శిక్షించే సీన్. హీరోని కట్టేసి కొరడాతో కొట్టండి అని కోట శ్రీనివాస రావు తీర్పు ఇస్తారు. ఆయన మనుషులు చిరంజీవి పట్టుకుని కట్టేయడానికి ప్రయత్నిస్తారు.

45
గూస్ బంప్స్ తెప్పించే డైలాగ్స్
Image Credit : Asianet News

గూస్ బంప్స్ తెప్పించే డైలాగ్స్

చిరంజీవి సీరియస్ గా ఒక్క లుక్ ఇస్తారు. ''నాకు నేను గా ఈ పంచాయతీకి వస్తే తప్ప నన్ను ఎవ్వరూ తీసుకురాలేరు. నాకు నేనుగా దెబ్బలు తింటే తప్ప నన్ను కట్టి కొట్టే మొనగాడు ఈ చుట్టుపక్కల లేడు''.. అంటూ చిరంజీవి ఆవేశంగా చొక్కా చించుతూ కొట్టాడా దెబ్బలకు సిద్ధం అవుతారు. ఆ సీన్ అంటే నాకు చాలా ఇష్టం అని సందీప్ రెడ్డి వంగా తెలిపారు.

55
తొలిసారి చిరంజీవికి విలన్ గా..
Image Credit : instagram / Sandeep reddy vanga

తొలిసారి చిరంజీవికి విలన్ గా..

ఆ సన్నివేశాన్ని తాను రిపీటెడ్ గా చూస్తూనే ఉంటాను అని పేర్కొన్నారు. సందీప్ రెడ్డి వంగా చెప్పిన ఆ సీన్ చూస్తే నిజంగానే గూస్ బంప్స్ రావడం గ్యారెంటీ. అలాంటి హీరోయిజాన్ని చిరంజీవి ఆ సీన్ లో చూపించారు. కోట శ్రీనివాసరావు, చిరంజీవి ఇద్దరూ ప్రాణం ఖరీదు సినిమాతోనే కెరీర్ ప్రారంభించారు. కానీ అప్పట్లో ఇద్దరికీ అంతగా పరిచయం లేదు. చిరంజీవితో ఫేస్ టు ఫేస్ విలన్ గా తొలిసారి ఖైదీ నెంబర్ 786 మూవీలో నటించాను అని కోట ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Paradise OTT Release: నాని 'ది ప్యారడైజ్' ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడు? ఎందులో చూడాలి?
Recommended image2
Brahmanandam: కోటీశ్వరులు కావడానికి ఈజీ మార్గం చెప్పిన బ్రహ్మానందం.. ఇలా చేస్తే చాలు ఆర్థిక ఇబ్బందులు రావట
Recommended image3
Anirudh: కావ్య మారన్‌ని పెళ్లి చేసుకోవడం వల్ల అనిరుధ్‌ కి వేల కోట్ల ఆస్తులు.. కొడితే కుంభస్థలం అంటే ఇదే
Related Stories
Recommended image1
Naga Vamsi: నేను చెబితే జనాలు తంతారు..ఆదర్శ కుటుంబం ట్రైలర్ లాంచ్, మూవీ రిలీజ్ డేట్ పై నాగవంశీ క్లారిటీ
Recommended image2
Bigg Boss 10: అసభ్యంగా మాట్లాడి స్లాంగ్ అంటారా.. షాలిని, రోహిత్, అమన్ లకు కోలుకోలేని దెబ్బ కొట్టిన నాగార్జున
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved