సునిల్, ఎన్.శంకర్ లకు పవర్ స్టార్ సపోర్ట్

First Published 25, Nov 2017, 12:06 AM IST
power star pawan kalyan support to n shankar suneel
Highlights
  • సునిల్ హీరోగా ఎన్.శంకర్ దర్శకనిర్మాతగా తెరకెక్కిన 2కంట్రీస్ చిత్రం
  • ఈ చిత్రం ఫస్ట్ లుక్ టీజర్ లాంచ్ చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
  • పవర్ స్టార్ సపోర్ట్ ఇవ్వటంతో మెగా ఆనందంలో సునీల్, శంకర్

సునీల్‌, మ‌నీషా రాజ్ జంట‌గా స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో మ‌హాల‌క్ష్మి ఆర్ట్స్ ప‌తాకంపై ఎన్‌.శంక‌ర్ నిర్మిస్తున్న చిత్రం 2 కంట్రీస్‌. శుక్ర‌వారం ఈ చిత్ర టీజ‌ర్‌ను ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఆవిష్క‌రించారు.

 

"సునీల్ క‌థానాయ‌కుడిగా శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన 2 కంట్రీస్ టీజ‌ర్‌ను నా చేతుల మీదుగా లాంచ్ చేయ‌టం ఆనందంగా ఉంది.  మ‌ళ్లీ మ‌ళ్లీ చూడాలనిపించేలా టీజ‌ర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. టీజ‌ర్‌లాగానే సినిమా ఉంటుంద‌ని ఆశిస్తూ చిత్ర‌యూనిట్‌కు అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నాను. ఈ సినిమా మంచి విజ‌యం సాధించాలి. నేను ఆద‌రించిన‌ట్టే ప్రేక్ష‌కులంద‌రూ ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను..జై హింద్‌" అని ప‌వ‌న్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అన్నారు.


ఈ సంద‌ర్భంగా క‌థానాయ‌కుడు సునీల్ మాట్లాడుతూ, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మా చిత్ర టీజ‌ర్‌ను లాంచ్ చేయ‌టం చాలా సంతోషంగా ఉంది. మా టీజ‌ర్‌ను లాంచ్ చేయ‌ట‌మే కాకుండా ఎంతో బాగుంద‌ని ప్ర‌శంసించిన ఆయ‌న‌కు జీవితాంతం రుణ‌ప‌డి ఉంటాను అని చెప్పారు.

 

ద‌ర్శ‌క‌,నిర్మాత ఎన్‌.శంక‌ర్ మాట్లాడుతూ... షూటింగ్‌లో ఎంతో బిజీగా ఉన్న‌ప్ప‌టికీ మేం అడ‌గ్గానే మా చిత్ర టీజ‌ర్‌ను లాంచ్ చేసిన ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌గారికి మ‌న‌స్ఫూర్తిగా కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాను. బిజీ టైమ్‌లో కూడా విలువైన స‌మ‌యాన్ని మాకు కేటాయించి ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మ‌రోసారి త‌న సహృద‌య‌త‌ను చాటుకున్నారు. మా టీజ‌ర్‌ను ఆయ‌న లాంచ్ చేయ‌టం సంతోషాన్నిస్తే, ఆ టీజ‌ర్ ఎంతో బాగుంద‌ని అప్రిషియేట్ చేయ‌టం మ‌రింత ఆనందాన్నిచ్చింది. అన్ని కార్య్ర‌క‌మాల‌ను పూర్తి చేసి డిసెంబ‌ర్‌లో సినిమాను విడుద‌ల చేస్తున్నాం అని అన్నారు.

 

ఇప్పటికే 2 కంట్రీస్ ఒరిిజినల్ సూపర్ హిట్ మూవీ. అదే నమ్మకంతో రీమేక్ గా తెరకెక్కించిన శంకర్, హీరో సునీల్ లకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సపోర్ట్ లభించడంతో సినిమాపై హైప్ క్రియేటయింది.

loader