టీజర్ కు పాజిటివ్ రెస్పాన్స్!

positive response to the teaser of Karthi's ‘Chinna Babu’
Highlights

 

హీరో కార్తీ నటించిన చినబాబు టీజర్ ను నిన్న సాయంత్రం  కార్తీ అన్న తమిళ్ స్టార్ హీరో సూర్య విడుదల చెయ్యడం జరిగింది

హీరో కార్తీ నటించిన చినబాబు టీజర్ ను నిన్న సాయంత్రం  కార్తీ అన్న తమిళ్ స్టార్ హీరో సూర్య విడుదల చెయ్యడం జరిగింది. టీజర్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభిస్తోంది. చినబాబు సినిమాలో రైతు పాత్రలో కార్తీ కనిపించబోతున్నాడు.

చినబాబు సినిమా టీజర్ చూస్తుంటే గ్రామీణ నేపథ్యంలో జరిగే ఒక రైతు గురించి సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. చినబాబు టీజర్ లో కార్తీ డైలాగు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. "పుట్టించినవాడు దేవుడైతే... పండించిన వాడు కూడా దేవుడే" "నువ్వే రైతు అయితే కాలర్ ఎగరేసుకొని తిరుగు"  అంటూ  రైతుల గొప్పదనం గురించి దర్శకుడు పాండిరాజ్ రాసిన డైలాగ్స్ కు మంచి స్పందన లభిస్తోంది. నటుడు సత్యరాజ్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. డి.ఇమాన్ సంగీతం అందిస్తున్న చినబాబు సినిమాను తమిళ్ స్టార్ హీరో సూర్య తో కలిసి నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.

నటీనటులు:

కార్తీ, సయేష, ప్రియా భవాని శంకర్, సత్య రాజ్, భానుప్రియ, తదితరులు

సాంకేతిక నిపుణులు:

కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం : పాండిరాజ్

నిర్మాతలు: సూర్య, మిరియాల రవీందర్ రెడ్డి

సహా నిర్మాతలు: సి.హెచ్. సాయి కుమార్ రెడ్డి, రాజశేఖర్ కర్పూర, సుందర పాండియాన్.

సంగీతం: డి.ఇమాన్

కెమెరామెన్: వేల్ రాజ్

 

loader