ఎన్టీఆర్ జీవితంపై సినిమా తెరకెక్కిస్తానన్న వర్మ వర్మ ప్రకటనపై పలువురు ప్రముఖుల స్వందన వర్మ సినిమా ఆలోచన మానుకోవాలని ప్రకటించిన పోసాని
తెలుగు సినీ పరిశ్రమలో నిజాన్ని నిర్భయంగా.. నిర్మొహమాటంగా మాట్లాడుతూ.. తాను చెప్పాలనుకున్నది చెప్పటంలో ఎలాంటి మొహమాటం లేని వారిలో పోసాని కృష్ణ మురిళి ముందుంటారు. మాటల రచయితగా ఎంట్రీ ఇచ్చి..తర్వాత దర్శకుడిగా, నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు పోసాని. తన మనసులో ఏదీ దాచుకోనని.. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా సరే కడిగిపాడేస్తా అంటూంటారు పోసాని. ప్రస్తుతం ఇండస్ట్రీలో బిజీ నటుడిగా కొనసాగుతున్న పోసాని తాజాగా ఓ సినిమాపై సంచలన కెమెంట్ చేసినట్లు తెలుస్తోంది.
తాజాగా సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ మహానటుడు ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కిస్తున్నాని ప్రకటించాడు. అయితే ఇందులో హీరో ఎవరు, ఆయా పాత్రలకు సంబంధించిన వివరాలు మాత్రం చెప్పలేదు. దీనిపై పోసాని మాత్రం తీవ్రంగా స్పందించారు. నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా ఎన్టీఆర్ బయోపిక్ ను రూపొందించాలనుకోవడం మంచిదేనని అయితే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి ఆ బాధ్యతలను అప్పగించడం సరికాదని పోసాని అభిప్రాయపడ్డారు.
ఎన్టీఆర్ కి చలన చిత్ర రంగంలోనే కాక రాజకీయాల్లోనూ ఎంతో మంచి పేరు ఉన్న సంగతి తెలిసిందే..అయితే రాజకీయాల్లో ఆయన చేసిన మార్పులు చేర్పులు చూపిస్తారా.. ఎన్టీఆర్ శతృవులను, నమ్మకద్రోహులను చూపిస్తానన్న వర్మ అది ఎంత వరకు నిజం చేస్తారని పోసాని అంటున్నారు. ఈ సినిమా వలన ఎన్టీఆర్ మీద ఎలాంటి మచ్చ పడకూడదన్నారు.
ఎన్టీఆర్ తెలుగు ప్రజలకు ఎవరెస్ట్ శిఖరమన్న పోసాని.. ఆయనను అవమానించేలా సినిమా తీస్తే జనం వెంటపడి కొడతారని, ఎన్టీఆర్ బయోపిక్ తీసే ప్రయత్నాన్ని మానుకోవాలని వర్మను కోరాడు. అంతే కాదు రోజుకు కోటి రూపాయలు ఇచ్చినా.. ఈ సినిమాలో మాత్రం నటించబోనని పోసాని ఖరాఖండిగా చెప్పేశారు. మరి వర్మ ఎలా స్పందిస్తాడో చూడాలి.
