రోడ్డు ప్రమాదంలో రవితతేజ సోదరుడు భరత్ అకాల మరణం అంత్యక్రియలకు హాజరుకాని రవితేజ, భరత్ వ్యక్తిగత విషయాలపై గోప్యత భరత్ వైవాహిక జీవితంపై గతంలో ఆసక్తికర విషయాలు వెల్లడించిన పోసాని
రవితేజ తమ్ముడు ఆకస్మిక మృతి, ఆ తర్వాత అంత్యక్రియలకు సొంత సోదరుడయిన రవితేజ హాజరు కాకపోవడం లాంటి పరిణామాలు తెలుగు సమాజాన్ని తీవ్రంగా కలచివేసాయి. ఇక రవితేజ, ఆయన కుటుంబ సభ్యులు మీడియాకు వీలైనంత దూరంగా ఉంటున్నారు. దీంతో భరత్ గురించిన వ్యక్తిగత విషయాలపై ఆసక్తి కనబరిచే వారికి అతని వివాదాస్పద జీవితం గురించి మాత్రమే తెలుసు తప్ప పెద్దగా వివరాలు తెలియట్లేదు. ముఖ్యంగా అతడి వైవాహిక జీవితం గురించి ఇండస్ట్రీలో కొంత మందికి మాత్రమే తెలుసు తప్ప పెద్దగా ఎవరికీ తెలియదు.
అయితే గతంలో భరత్ గురించి ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళి ఓ ఇంటర్వ్యూలో సంచలన కామెంట్స్ చేశారు. ఇంటర్వ్యూ విశేషాలను మరోసారి గుర్తు చేసుకుంటే భరత్ గురించి మరికొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. ఓసారి భరత్ ఓ అమ్మాయిని ప్రేమించానని లేపుకొచ్చి తనను ఇబ్బందుల్లో పడేసినట్లు పోసాని గతంలో అన్నారు.
దాదాపు ఇరవైయ్యేళ్ల క్రితం తాను పరుచూరి బ్రదర్స్ వద్ద అసిస్టెంటుగా పని చేస్తున్న రోజుల్లో ఇది జరిగిందని తెలిపారు. అపుడు ఏం జరిగిందంటే... పరుచూరి బ్రదర్స్ వద్ద పని చేస్తున్న రోజుల్లో వారి ఇంటి ఆవరణలోనే ఓ గదిలో పోసాని ఉండేవారు. ఓ రాత్రి హైదరాబాద్ నుండి ఓ అమ్మాయితో పారిపోయి చెన్నై వచ్చిన భరత్...పోసాని సహాయం కోరాడట. ఆ రాత్రి భరత్ పరిస్థితి చూసి తన రూమ్ వారికి ఇచ్చి తను వేరేచోట పడుకున్నారట. రవితేజ అప్పటికి హీరో కాలేదని, చిన్న చిన్న వేషాలు వేస్తూ ప్రయత్నాలు చేస్తున్నాడని పోసాని అన్నారు. అప్పటికింకా రవితేజ కూడా పోసానికి పరిచయం లేదట.
అయితే పోసానికి కేటాయించిన గదిలో అమ్మాయి కనిపించడంతో వీరు ఇక్కడ ఏదో తప్పుడు పనులు చేస్తున్నారని అనుమాన పడిన పరుచూరి కుటుంబ సభ్యులు గొడవ చేశారని, పోసానిని బయటకు పంపేసారని, ఆ విధంగా భరత్ ప్రేమ వ్యవహారం తనకు పరుచూరి బ్రదర్స్ వద్ద ఉపాధిని లేకుండా చేసిందని పోసాని అప్పట్లో వివరించారు. ఘటనపై తనను ఏం జరిగిందని అడగకుండా పంపించారని, ఆ తర్వాత తను ఎప్పుడూ పరుచూరి ఇంటి మెట్లు ఎక్కలేదని పోసాని అప్పట్లో చెప్పుకొచ్చారు.
ఇక అప్పట్లో భరత్ తీసుకొచ్చింది డబ్బున్న ఇంటి అమ్మాయి అని, వారి పెళ్లి దగ్గరుండి తామే చేశామని... అప్పట్లో పోసాని తెలిపారు. ఆ తర్వాత వాళ్లు విడిపోయారని సమాచారం. ఇక భరత్‌కు నాలుగేళ్ల క్రింద మరో పెళ్లి జరిందని, అయితే.. ప్రస్తుతం వారు విడిగానే ఉంటున్నారని సమాచారం. ఏదేమైనా కేరీర్ లో అదృష్టం వరించి సల్మాన్ బిగ్ బాస్ షోలో పాల్గొనాల్సిన భరత్... అదృష్టం వరించినా... మృత్యువు లాక్కెల్లింది.
