ఒక్కసారి ఓ హీరోని అభిమానిస్తే.. వారి కోసం ఏదైనా చేసేందుకు వెనకాడరు.అభిమానులు మాత్రమే కాదు.. సినీ పరిశ్రమలో వారు కూడా ఇదే విధంగా చేస్తుంటారు.
‘వ్యక్తి పూజ’ అనేది సినిమా రంగంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా దక్షిణాది సినిమా రంగంలో ఇది మరింత ఎక్కువ. ఒక్కసారి ఓ హీరోని అభిమానిస్తే.. వారి కోసం ఏదైనా చేసేందుకు వెనకాడరు. వారి నామ జపం చేస్తూ.. నిత్యం వారిని కీర్తిస్తూ ఉండేవారు కోకొల్లలు. అభిమానులు మాత్రమే కాదు.. సినీ పరిశ్రమలో వారు కూడా ఇదే విధంగా చేస్తుంటారు.
కాగా..ఇలాంటి వాటికి పోసారి కృష్ణ మురళి దూరంగా ఉంటారు. ఎలాంటి విషయంపై నేనా నిర్భయంగా మట్లాడతారన్న పేరు ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళికి ఉంది. అయితే.. ఆయన ఇటీవల మహేష్ బాబు, ఎన్టీఆర్ లపై చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. వారిరువురిని ఆయన తెగ పొగిడేశారు.
ఓ ప్రముఖ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వీరి గురించి మాట్లాడారు. హీరో కృష్ణ ఎలా ఉంటారో... మహేష్ బాబు కూడా ప్రవర్తనలో అచ్చుగుద్దినట్లు ఆయన లానే ఉంటారని పోసాని అన్నారు. అంతేకాకుండా మహేష్.. ఎవరి గురించి తప్పుగా.. అసహ్యంగా మాట్లాడటం తాను వినలేదన్నారు. పెద్ద స్టార్ అన్న పొగరు తనలో కొంచెం కూడా కనిపించదని.. జూనియర్ ఆర్టిస్టుకు కూడా మర్యాద ఇస్తాడని చెప్పారు.ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే.. దేవుడు తారక్ కి డబ్బు, అందం, హోదా అన్నీ ఇచ్చినా.. కొంచెం కూడా అహంకారం ఉండదని చెప్పారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. పొలంలో ఎంత మంచి పంట వేసినా.. కలుపు మొక్కలు పుడుతూనే ఉంటాయి.. అంటూ కొందరు నటులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
