నమ్మక ద్రొహి పవనేనా పూనం..?

poonam kaur tweets on pawan kalyan or trivikram
Highlights

 నమ్మక ద్రొహి పవనేనా పూనం..?

పూనంకౌర్ అప్పుడప్పుడు ట్విట్టర్‌లో బాంబు పేలుస్తుంటుంది. ఆ ట్వీట్ బాంబులు ఎవరి మీద వేశారో అర్థమైనట్లు ఉంటుంది..కానీ అర్థం కాదు. చాలా రోజులుగా ఇతే తంతు. కొద్ది రోజుల క్రితం.. ఇలాంటి ట్వీట్లు చేసి.. కాస్త వైరల్ అవుతూండగానే… డిలీట్ చేసేసింది. కానీ ఈ మధ్య అలా చేయడం లేదు. గురువారం రాత్రి కూడా.. ఇలాంటి ట్వీట్లు చేసి అయోమయంలోకి నెట్టేసింది. ఆ ట్వీట్లలో ఏమన్నారంటే.. సింపుల్‌గా ” జల్సాలు చూపిస్తూ.. ఆజ్ఞాతవాసంలో ఏసేస్తాడు.. జాగ్రత్త” అంటూ.. నమ్మకద్రోహి హ్యాష్ ట్యాగ్‌ను జత చేసింది. అంతలోనే ట్వీట్ వైరల్ అయిపోయింది. 

ఇంతకీ పూనంకౌర్ ఈ ట్వీట్లలో ఎవరికి నమ్మకద్రోహి బిరుదిచ్చారు..? జల్సాలు చేసి.. అజ్ఞాతవాసంలో వేసేసేది ఎవరు..? దీనిపై మాత్రం అటు పొలిటికల్ ఫ్యాన్స్..ఇటు సినీ ఫ్యాన్స్ కి క్లారిటీ వచ్చినట్లు వచ్చింది.కానీ రావడం లేదు. కొద్ది రోజుల క్రితం కూడా ఇలాంటి ట్వీట్లు చేసింది. ఓ దర్శకుడిని ఉద్దేశించి చేసిన ట్వీట్లు అవి. ఇప్పుడు దర్శకుడిని ఉద్దేశించి చేసినవా..? హీరోను ఉద్దేశించి చేసినవా అన్నదానిపై మాత్రం ఎవరికీ క్లారిటీ రావట్లేదు.

loader