Asianet News TeluguAsianet News Telugu

టాలీవుడ్ పై ప్రధాని మోడీ ప్రశంసలు.. పూనమ్ కౌర్ ఎలాంటి సెటైర్ వేసిందో చూశారా

బాహుబలి చిత్రంతో తెలుగు సినిమా గతే మారిపోయింది. గతంలో సౌత్ వాళ్ళు బాలీవుడ్ వైపు ఆశ్చర్యంగా చూసేవాళ్ళు. ఆ రోజులు మారాయి. దేశం మొత్తం ఆమాటకు వస్తే హాలీవుడ్ సైతం తెలుగు సినిమా గురించి చర్చించుకుంటోంది.

Poonam Kaur sensational comments on tollywood
Author
Hyderabad, First Published Feb 7, 2022, 7:43 AM IST

బాహుబలి చిత్రంతో తెలుగు సినిమా గతే మారిపోయింది. గతంలో సౌత్ వాళ్ళు బాలీవుడ్ వైపు ఆశ్చర్యంగా చూసేవాళ్ళు. ఆ రోజులు మారాయి. దేశం మొత్తం ఆమాటకు వస్తే హాలీవుడ్ సైతం తెలుగు సినిమా గురించి చర్చించుకుంటోంది. బాహుబలి తర్వాత ఎక్కువగా టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా చిత్రాలు తెరకెక్కుతున్నాయి. 

ప్రభాస్ ఏకంగా అంతర్జాతీయ మార్కెట్ పై కన్నేశాడు. టాలీవుడ్ హీరోలంతా పాన్ ఇండియా చిత్రాలవైపు చూస్తున్నారు. బాలీవుడ్ కు కూడా సాధ్యం కానీ విధంగా తెలుగు సినిమా వసూళ్లు రాబడుతోంది. ఇటీవల ప్రధాని మోడీ 16 అడుగుల శ్రీరామానుజ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోడీ తెలుగు సినిమాపై ప్రశంసలు కురిపించారు. 

సిల్వర్ స్క్రీన్ నుంచి ఓటిటి వరకు తెలుగు సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇక్కడి క్రియేటివిటీపై ప్రశంసలు దక్కుతున్నాయి. తెలుగు భాష ఎంతో సుసంపన్నమైనది అంటూ మోడీ ప్రశంసల వర్షం కురిపించారు. 

అయితే మోడీ కామెంట్స్ కి కౌంటర్ గా పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది. ఎప్పుడూ నర్మగర్భంగా కామెంట్స్ చేసే పూనమ్ కౌర్ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఈసారి కూడా అదే పంథా ఫాలో అయింది ఈ పంజాబీ భామ. 

'తెలుగు సినిమాని ప్రధాన మంత్రి అర్థం చేసుకున్న విధానానికి.. కానీ ఇక్కడ ఉన్న దుస్థితికి చాలా తేడా ఉంది' అంటూ పూనమ్ కౌర్ సెటైర్ వేసింది. కాసేపటికి పూనమ్ తన ట్వీట్ డిలీట్ చేసింది. 

దీనితో పూనమ్ కౌర్ పై నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. ఎప్పుడూ ఏ విషయాన్ని నేరుగా చెప్పలేని పూనమ్ కౌర్.. ఇలా తెలుగు సినిమాని అవమానించే విధంగాకామెంట్స్ చేయడం సరికాదు అని అంటున్నారు. ప్రధాని లాంటి వారు తెలుగు సినిమాని ప్రశంసిస్తుంటే.. పూనమ్ కౌర్ లాంటి వాళ్ళు పరువు తీసే విధంగా వ్యవహరిస్తున్నారు అంటూ ట్రోలింగ్ జరుగుతోంది. 

Poonam Kaur sensational comments on tollywood

Follow Us:
Download App:
  • android
  • ios