సినిమా తారలుగా ఉన్నప్పుడు సోషల్ మీడియాలో జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. మీడియా మధ్య పోటీ తీవ్రంగా ఉన్న తరుణంలో చిన్న ఏమరుపాటుకు కూడా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఇది పూనం కౌర్ కు మెల్లగా అనుభవంలోకి వస్తోంది. ఆ మధ్య కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఇష్యూలో అనుకోకుండా వెళ్ళి బాగా ఇరుక్కుపోయి నానా రచ్చ చేసుకున్న హీరొయిన్ పూనం కౌర్ నిన్న మరోసారి వార్తల్లోకి ఎక్కిన విషయం చూసాం. పవన్ జనసేన ఆవిర్భావ సభ ముగిసాక నేరుగా కాకపోయినా అతన్నే టార్గెట్ చేస్తున్నట్టు అనిపించే ఘాటైన పదాలతో పూనం కౌర్ కాస్త పెద్ద పోస్టే పెట్టింది. రంగులు మార్చే రాజకీయ నాయకుల గురించి వాళ్ళను నమ్ముకున్న వాళ్ళకు మోసం చేయటం గురించి పూనం పెట్టిన ఆ మెసేజ్ ఫేస్ బుక్ లో పెను దుమారమే రేపింది.వార్తల కోసం కాచుకుని కూర్చున్న ఛానల్స్ కు ఇది లడ్డులాగా దొరకటంతో దీంతో బాగానే పండగ చేసుకున్నారు. పూనం ఈ కామెంట్స్ చేసింది పవన్ గురించే అని రకరకాల విశ్లేషణలు చేయటం మొదలు పెట్టారు. పవన్ ఫాన్స్ పేరుతో కొందరు రివర్స్ కామెంట్స్ పోస్ట్ చేయటంతో ఇది ముదిరింది అని గమనించిన పూనం ఆ పోస్ట్ మొత్తం డిలీట్ చేసేసి వేరే ఫోటో మ్యాటర్ తో దాన్ని ఏమార్చింది. కాని ముందు పెట్టింది ఈ పాటికే అందరికి రీచ్ అయిపోయివడంతో ఇప్పుడు డిలీట్ చేయటం వల్ల పెద్దగా ప్రయోజనం లేదు. గతంలో వివాదం రేగినప్పుడు పవన్ ఫాన్స్ కత్తి మహేష్ మధ్య రాజీ ఫార్ములా కుదిరినప్పటికీ పూనం కౌర్ కు దక్కిన ఊరట ఏమి లేదు. అప్పుడు కూడా ట్విట్టర్ లో ఒకటి రెండు కామెంట్స్ చేసి ఇలాగే డిలీట్ చేయటం కూడా న్యూస్ గా మారింది. సినిమాలు లేకపోయినా ఈ ఇష్యూ వల్ల పూనం కౌర్ కు బాగానే పాపులారిటీ దక్కింది