తెలంగాణ ఎన్నారై ఫోరం ఆధ్వర్యంలో.. లండన్ లో బోనాల పండుగ లండన్ లో తెలంగాణ బోనమెత్తిన సినీ నటి పూనమ్ కౌర్ హెస్టన్ కమ్యూనిటీ స్కూల్లో వైభవంగా జరిగిన బోనాల పండుగ
లండన్ లో 6వ సంవత్సరం వరుసగా ఎంతో వైభవంగా బోనాల జాతర నిర్వహిస్తున్న తెలంగాణ ఎన్నారై ఫోరం ఆధ్వర్యంలో.. లండన్ లోని హెస్టన్ కమ్యూనిటీ స్కూల్లో.. ఈసారి బోనాల పండుగను వైభవంగా నిర్వహించారు. ఈసంబరాలకు యూకే నలుమూలల నుండి సుమారు 700లకు పైగా తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎన్నారైల కుటుంబ సభ్యులు హాజరయ్యారు. సంప్రదాయబద్దంగా అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించి, లండన్ వీధుల్లో తొట్టెల ఊరేగింపు జరుపుకున్న తీరు ప్రవాస తెలంగాణ బిడ్డలనే కాకుండా స్థానికులని కూడా మంత్రముగ్దులని చేసింది.
తెలంగాణ ఎన్నారై ఫోరం ఈ సంవత్సరము ప్రధానంగా చేపట్టిన చేనేతకు చేయూతనిద్దాం.. నేతన్నకు మద్దతునిద్దాం.. చేనేతవస్త్రాలయం ద్వారా ప్రవాసులకు స్థానికులకు చేనేత వస్త్రాలను పరిచయం చేసిన విధానం ప్రశంసనీయం అని ముఖ్య అతిధులు కొనియాడారు. తెలంగాణ ప్రబుత్వ ప్రతినిధి రామచంద్రుడు తేజావత్ మాట్లాడుతూ ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించిన ఎన్నారైలు తెలంగాణ అభివృద్ధిలో తెలంగాణ పెట్టుబడుల్లో బాగస్వామ్యులవ్వాలని పిలుపునిచ్చారు. విదేశాల్లో భారతీయ ఐక్యత చాటాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా.. నటి పూనమ్ కౌర్ మాట్లాడుతూ తెలంగాణ ఎన్నారై ఫోరం చేపట్టిన ఎన్నారై విత్ వీవెర్స్, చేనేత చేయూతకు తన సంపూర్ణ మద్దతు ఇస్తానని తెలిపారు. తెలంగాణ ఎన్నారై ఫోరమ్ తో చేనేతకు చేయూత కు కలిసి పని చేస్తానని తెలిపారు. తెలంగాణఎన్నారై ఫోరం మహిళా విభాగంతో కలిసి హ్యాండ్లూమ్ వాక్ లో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర చేనేత వస్త్రాల ప్రదర్శన మరియు బోనాలు పండుగ వేడుకలలో తాను భాగమైనందుకు ఎంతో సంతోషంగా ఉందని నటి పూనమ్ కౌర్ పేర్కొన్నారు. బోనాల పండుగకు యూకే తెలుగు,తెలంగాణ సంఘాలు,యుక్త ,తాల్ ,టీడీఫ్ తెలంగాణ జాగృతి ,తమ సంపూర్ణ మద్దతు తెలిపి విజయవంతం చేశారు.
ఇక ఆభరణాలు ,ఆధునిక వస్త్ర శ్రేణి మరియు కళలకు సంబంధించిన ప్రదర్శనను మొదటి సారిగా తెలంగాణఎన్నారై ఫోరం సంస్థనిర్వహించడం ఔత్సాహిక కళాకారులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చింది అని ,తమ ప్రతిభను ప్రదర్శించివ్యాపారభివ్రిద్దికి ఎంతోతోడ్పాటును ఇస్తుందని ప్రదర్శనలో పాల్గొన్నకళాకారులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
