పూజ హెగ్డే బంపర్ ఆఫర్ కొట్టేసింది

pooja hegde to romance superstar mahesh
Highlights

  • సూపర్ స్టార్ మహేష్ సరసన ఛాన్స్ కొట్టేసిన పూజ హెగ్డే
  • తెలుగులో వరుస ఆఫర్లతో దూసుకెళ్తున్న డీజే బ్యూటీ
  • వంశీ పైడిపల్లి , మహేష్ ల తదుపరి సినిమాలో  హిరోయిన్ గా పూజ

 

అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాధం సినిమాలో హిరోయిన్ గా నటించిన పూజా హెడ్గేకు మంచి పేరే వచ్చింది. గతంలో ముకుందా ఒక లైలా కోసం సినిమాలు చేసినా అవి ఆడకపోవడంతో బాలీవుడ్ చెక్కేసి తిరిగి డిజే తో ఇక్కడికే వచ్చేసిన పూజా సుడి ఇప్పుడు మామూలుగా లేదు. డిజే మూవీలో ఒక్క స్విమ్మింగ్ పూల్ సీన్ కోసమే ఆ సినిమా చూసిన చూస్తున్న రసిక ప్రియులు లక్షల్లో ఉన్నారు. అంతగా తన అందచందాలతో యువత మతులు పోగొట్టిన పూజా ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో సాక్ష్యం సినిమాలో నటిస్తోంది. దీని కోసం భారీ పారితోషికం అందుకుంది అనే వార్త ఇప్పటికే బాగా ప్రచారంలో ఉంది. తాజాగా పూజా మరో బంపర్ ఆఫర్ కొట్టేసే ఛాన్సులు పుష్కలంగా ఉన్నాయి. మహేష్ బాబు 25 మూవీగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు - అశ్విని దత్ కంబైండ్ గా నిర్మించే మూవీలో పూజా హెగ్డేను తీసుకునే విషయంగా సీరియస్ డిస్కషన్ జరుగుతోంది అని టాక్.ప్రస్తుతం భరత్ అను నేను ఫినిష్ చేయటంలో బిజీగా ఉన్న ప్రిన్స్ దాని పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ కాకముందే వంశీ సినిమా మొదలు పెట్టనున్నాడు. అల్లరి నరేష్ కూడా ఇందులో ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలిసింది. పాతికవ సినిమా కాబట్టి చాలా  స్పెషల్ గా ఉండేలా స్క్రిప్ట్ సిద్ధం చేసినట్టు తెలిసింది. మహేష్ కు పోటీగా ఫాన్స్ భావించే పవన్ కళ్యాణ్ 25వ సినిమా మహేష్ 25వ సినిమా ఒకే సంవత్సరంలో రావడం కాకతాళీయమే అయినా విశేషంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ సినిమాకు క్యూట్ బేబీ పూజా హెడ్గే హీరొయిన్ గా దాదాపు ఓకే కావడంతో మహేష్ పక్కన తనను ఊహించుకుని ఫాన్స్ అప్పుడే అంచనాలు వేసుకోవడం మొదలు పెట్టారు.ప్రస్తుతం లండన్ లో ఉన్న పూజా తిరిగి వచ్చాక డీల్ జరగవచ్చు. 
 

loader