నన్ను మోసం చేస్తారా..? స్టార్ హీరోయిన్ ఫైర్!

Pooja Hegde miffed with her team after Saakshyam debacle?
Highlights

ఎన్టీఆర్, మహేష్ బాబుల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. ఈ క్రమంలో ఆమె మరో సినిమా ఒప్పుకుంది. అదే 'సాక్ష్యం'. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన ఈ సినిమా గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది

టాలీవుడ్ లో 'ముకుంద' చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే కెరీర్ ఆశించిన స్థాయిలో సాగలేదు. దీంతో బాలీవుడ్ కు వెళ్లిపోయింది. అక్కడ కూడా ఆమెకు సరైన బ్రేక్ రాకపోవడంతో తిరిగి టాలీవుడ్ కు వచ్చేసింది. 'డిజె' సినిమాతో యూత్ మొత్తాన్ని ఒక్కసారిగా తనవైపు తిప్పుకుంది. తన అందాల ప్రదర్శనతో టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. స్టార్ డైరెక్టర్స్, హీరోలు తమ సినిమాల్లో పూజాను హీరోయిన్  గా ఫైనల్ చేసుకున్నారు. ఎన్టీఆర్, మహేష్ బాబుల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. ఈ క్రమంలో ఆమె మరో సినిమా ఒప్పుకుంది. అదే 'సాక్ష్యం'.

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన ఈ సినిమా గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ అనుకున్న విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. ముఖ్యంగా పూజా నటనపై నెగెటివ్ కామెంట్స్ వినిపించాయి. మేకప్ కూడా సెట్ కాకపోవడంతో తెరపై అందంగా కనిపించలేదు. ఆమెపై వస్తోన్న ఈ విమర్శలని జీర్ణించుకోలేకపోతోంది ఈ బ్యూటీ. నిజానికి ఈ సినిమాలో నటించడానికి మొదట ఆమె అంగీకరించలేదట. కానీ ఆమె టీమ్ లో సభ్యులు ఇది మామూలు సినిమా కాదని ఇండస్ట్రీ హిట్ అవుతుందని, రెమ్యునరేషన్ కూడా పెద్ద మొత్తంలో ఇస్తున్నారని ఆమెని నమ్మించి ఓకే చేయించారట.

కానీ ఈ సినిమా రిజల్ట్ తేడా కొట్టడంతో మాయ మాటలతో నన్ను మోసం చేస్తారా..? అంటూ టీమ్అపి ఫైర్ అయిందట ఈ బ్యూటీ. ప్రస్తుతం ఆమె ఎన్టీఆర్ నటిస్తోన్న 'అరవింద సమేత' సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాపైనే తన ఆశలన్నీ పెట్టుకుంది పూజా. దసరా కానుకగా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

loader