పవన్ త్రివిక్రమ్ సినిమాలో పూజా హెగ్డే పవన్ కళ్యాణ్ సరసన ఛాన్స్ కొట్టేసిన హెగ్డే
త్రివిక్రమ్.. పవన్ కల్యాణ్ కాంబినేషన్లో కొత్త సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవలే జరిగాయి. 'జల్సా'.. 'అత్తారింటికి దారేది' సినిమాల తరహాలో, ఈ సినిమాలోను ఇద్దరు కథానాయికలు ఉండనున్నారని సమాచారం.
ఒక కథానాయికగా ఇప్పటికే కీర్తి సురేశ్ ను ఎంపిక చేసారు. తన ట్విట్టర్ ఎకౌంట్ లో ఈ విషయాన్ని ప్రకటించుకుని తెగ సంబరపడిపోతోంది కీర్తి. ఇక ఈ సినిమాలో మరో హీరోయిన్ రోల్ కోసం పవన్ త్రివిక్రమ్ లు పూజా హెగ్డేను తీసుకోవాలనే ఆలోచనలో వున్నట్టుగా సమాచారం. దాదాపు ఆమెనే ఖాయం చేయవచ్చని చెబుతున్నారు.
పూజా హెగ్డే ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న 'దువ్వాడ జగన్నాథం' సినిమా చేస్తోంది. ఇక పవన్ - త్రివిక్రమ్ ల సినిమా వచ్చేనెలలో రెగ్యులర్ షూటింగ్ మొదలెట్టనుంది.
