తెలుగు హీరోయిన్ పై కుట్ర జరిగిందా..?

Politics against talented Telugu actress
Highlights

టాలెంట్ ఉన్న ఈ తెలుగమ్మాయికి అవకాశాలు రాకుండా ఓ కో డైరెక్టర్ అడ్డు పడుతున్నాడని తాజా సమాచారం. ఆమెకు క్రమశిక్షణ లేదని, చెప్పిన సమయానికి షూటింగ్ కి రాదని ఇలా ఆమెపై నెగెటివ్ వార్తలు స్ప్రెడ్ చేయడంతో దర్శకనిర్మాతలు కూడా ఆమెను లైట్ తీసుకున్నారట.

టాలీవుడ్ లో తెలుగమ్మాయిలు హీరోయిన్ గా రాణించేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఇక్కడ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తమిళ చిత్రాలతో కాలం గడుపుతున్న తెలుగమ్మాయిలు చాలా మంది ఉన్నారు. దానికి పలు కారణాలు ఉన్నప్పటికీ ఓ తెలుగు హీరోయిన్ ను మాత్రం కావాలనే ఎదగకుండా చేశారనే వార్తలు ఊపందుకున్నాయి. తేజ డైరెక్షన్ లో హీరోయిన్ గా పరిచయమైన ఓ తెలుగమ్మాయి ఆ తరువాత హారర్, కామెడీ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

తెలుగులో మంచి సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ వెంటనే మలయాళంలో సినిమా చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ తరువాత తెలుగులో అరకొర అవకాశాలే తప్ప హీరోయిన్ గా ఆమెకు సరైన గుర్తింపు తీసుకొచ్చే పాత్రలు పడలేదు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'జైలవకుశ' సినిమాలో క్యామియో పాత్ర చేసినా.. అమ్మడుకి కలిసి రాలేదు. టాలెంట్ ఉన్న ఈ తెలుగమ్మాయికి అవకాశాలు రాకుండా ఓ కో డైరెక్టర్ అడ్డు పడుతున్నాడని తాజా సమాచారం.

ఆమెకు క్రమశిక్షణ లేదని, చెప్పిన సమయానికి షూటింగ్ కి రాదని ఇలా ఆమెపై నెగెటివ్ వార్తలు స్ప్రెడ్ చేయడంతో దర్శకనిర్మాతలు కూడా ఆమెను లైట్ తీసుకున్నారట. కానీ ఆమె సినిమాల పట్ల నిబద్దతతో ఉంటుందని సమాచారం. ఆమెపై కక్షసాధింపు కోసమే సదరు కో డైరెక్టర్ అవకాశాలు రాకుండా చేస్తున్నాడని టాక్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ అనే పదం అందరికీ తెలిసిందే. ఆయన గారు అడిగిన కమిట్మెంట్ కు ఈ ముద్దుగుమ్మ నో చెప్పినందుకే ఇలా చేస్తున్నాడని సమాచారం. ప్రస్తుతం ఆమె ఓ సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది. హారర్, థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో ఆమె సరసన కమెడియన్ సత్యం రాజేష్ హీరోగా కనిపించనున్నాడు.  

loader