విశాల్ కు హిందూ సంస్థల హెచ్చరిక

First Published 12, May 2018, 12:38 PM IST
police security at vishal house
Highlights

విశాల్ కు హిందూ సంస్థల హెచ్చరిక

మిత్రన్ దర్శకత్వంలో విశాల్ నటించిన తమిళ చిత్రం ‘ఇరుంబు తిరై’ చిత్రం విడుదలైంది. ఆధార్ కార్డుకు సంబంధించి తప్పుడు సమాచారమే కాకుండా కేంద్ర ప్రభుత్వ ‘డిజిటల్ ఇండియా’పై ఈ చిత్రంలో విమర్శించినట్టు హిందూ సంస్థలు ఆరోపిస్తూ మద్రాసు హైకోర్టును ఆశ్రయించాయి. ఈ సినిమా విడుదలను ఆపాలంటూ వేసిన పిటిషన్ ను హైకోర్టు తోసి పుచ్చింది. దీనిపై నిరసన వ్యక్తం చేస్తున్న హిందూ సంస్థలు హీరో విశాల్ ఇంటిని ముట్టడించనున్నట్టు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో విశాల్ ఇంటికి పోలీసులు భద్రత కల్పించారు. కాగా, ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. మంచి కలెక్షన్స్ రాబట్టే అవకాశాలు ఉన్నాయని కోలీవుడ్ వర్గాల సమాచారం.

loader