మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో దొంగతనం గత కొన్నేళ్లుగా సాగుతున్న తంతు ఏళ్ల తరబడి భారీమొత్తం చోరీ చేసిన ఇంటి పని మనిషి పోలీసుల విచారణలో వెలుగు చూసిన షాకింగ్ నిజాలు

మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో దొంగలు రూ. 2 లక్షల నగదు దొంగిలించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. చిరు మేనేజర్ గంగాధర్ నిన్న ఈ దొంగతనంపై పోలీసులకి ఫిర్యాదు చేశాడు. చోరీ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు..నిందితున్ని పట్టుకున్నారు. దర్యాప్తులో భాగంగా చిరంజీవి ఇంటి పనిమనిషి చెన్నయ్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.

గత పదేళ్లుగా చిరంజీవి ఇంట్లో పనిచేస్తున్న చిన్నయ్య చిరు ఇంటినుంచి ఇప్పటివరకు పలు విడతలుగా రూ.16లక్షలు దొంగిలించినట్టు నిర్ధారణ అయింది.

ఇక అతను రెండు చోట్ల ఫ్లాట్స్ కూడా కొనుగొలు చేసినట్టు ఎంక్వైరీలో తేలింది. ఫ్లాట్స్ పత్రాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు, నిందితుడి నుండి మరింత సమాచారాన్ని రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి త్వరలోనే షూటింగ్ ప్రారంభించుకోనుంది. ఈ మూవీతో త్వరలోనే చిరు బిజీ కానున్నాడు. డిసెంబర్ 6నుంచి షూటింగ్ మొదలవుతుందని అంటున్నారు.